
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. పవన్ గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అభిమానులు కూడా అజ‍్ఞాతవాసిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
పవన్ గత చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండా పవర్ స్టార్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అంతర్జాతీయ బ్రాండ్ లు పోటి పడుతున్నాయి. గతంలో ఏ దక్షిణాది సినిమాకు చేయని విధంగా అజ‍్ఞాతవాసి సినిమాను 7 అంతర్జాతీయ బ్రాండ్ లు ఈ సినిమాను ఆడియో ఈవెంట్ను స్పాన్సర్ చేస్తుండటం విశేషం. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment