
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కట్స్ తో రూపొందించిన ఈ టీజర్ పవన్ అభిమానులు అలరిస్తోంది. చాలా రోజులుగా టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ రికార్డ్స్ కు తెర తీశారు. కేవలం 30 నిమిషాల్లో పది లక్షలకు పైగా వ్యూస్ తో పాటు లక్షకు పైగా లైక్స్ సాధించి సంచలనం సృష్టించింది ఈ టీజర్.
ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతున్న ఈ టీజర్ తెలుగులో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్ గా రికార్డ్ సృష్టించింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ స్వరాలందించారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా జనవరి 10న పేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment