
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ బుధవారం అజ్ఞాతవాసిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. అందుకు తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో షోస్ వేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అజ్ఞాతవాసి.
చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది హీరోయిన్ అను ఇమ్మాన్యూల్. పవన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్న అను.. ఎంతో క్రేజ్ ఉన్న ఆయన సాధారణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. షూటింగ్ లేకపోతే విదేశాల్లో రిలాక్స్ అవుతారని ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువని, ఆయనతో కలిసి పని చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment