హీరో రామ్కి ఎక్స్ గర్ల్ఫ్రెండ్గా .... | mangalampalli sri sathya interview with sakshi | Sakshi
Sakshi News home page

హీరో రామ్కి ఎక్స్ గర్ల్ఫ్రెండ్గా ....

Published Sun, Jan 3 2016 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

హీరో రామ్కి ఎక్స్ గర్ల్ఫ్రెండ్గా ....

హీరో రామ్కి ఎక్స్ గర్ల్ఫ్రెండ్గా ....

మంగళంపల్లి శ్రీసత్య.. విజయవాడ వాసులకు సుపరిచితమైన పేరు. గత ఏప్రిల్‌లో జరిగిన అందాల పోటీల్లో మిస్ విజయవాడగా గెలుపొందిన పదహారణాల తెలుగమ్మాయి. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఇష్టం ఉన్న శ్రీసత్య ఇటీవల విడుదలైన ‘నేను శైలజ’ చిత్రంలో హీరోకి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్ర వేసి, వెండితెర నటనకు తెరతీసింది. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీసత్య ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ .
 

 
సాక్షి : నేను శైలజ సినిమాలో మీ పాత్ర గురించి...

శ్రీసత్య : ఈ చిత్రంలో హీరో రామ్‌కు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించాను. నా పాత్ర చాలా చిన్నది. కానీ, పెద్ద బ్యానర్‌లో నా తెరంగేట్రం జరగడం ఆనందంగా ఉంది.


సాక్షి : ఏం చదువుతున్నారు?
శ్రీసత్య : సిద్ధార్థ కళాశాలలో బీబీఎం మొదటి సంవత్సరం చదువుతున్నాను.
 

సాక్షి : మిస్ విజయవాడ కాంటెస్ట్‌లో పాల్గొనడం గురించి...
శ్రీసత్య : ప్లస్ టూ అయ్యాక మిస్ విజయవాడ కాంటెస్ట్ పెడుతున్నారని తెలిసి పాల్గొన్నాను. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. మొత్తం 300 మందిలో ఫస్ట్ వచ్చాను.
 

సాక్షి :  సెలక్షన్ విధానం ఎలా ఉంటుంది?
శ్రీసత్య : క్యాట్‌వాక్ చేయమంటారు. ఆ తరువాత కొన్ని ప్రశ్నలు వేశారు. ఇందులో చీర, షార్ట్, ఫ్యాన్సీ మూడు రకాల డ్రెస్‌లు వేసుకుంటాం.


సాక్షి :  మిస్ విజయవాడగా మిమ్మల్ని నిలబెట్టిన ప్రశ్న?
శ్రీసత్య : అమ్మ కావాలా? నాన్న కావాలా? దేశం కావాలా? అని అడిగారు. వాళ్లు అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుందని మాకు శిక్షణలో నేర్పారు. నేను జాగ్రత్తగా ఆలోచించి ‘దేశం కావాలి’ అన్నాను. ఎందుకని ప్రశ్నించారు. ‘ఆ మట్టి ఉంటేనే కదా అమ్మ, నేను, నాన్న ఉంటాం’ అన్నాను. నా సమాధానం వారికి నచ్చింది. ‘మిస్ విజయవాడకు ఎందుకు వచ్చావు?’ అని అడిగారు. ‘ఇంట్రస్ట్‌తో వచ్చాను, గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను.’ అన్నాను. దాంతో నన్ను సెలక్ట్ చేశారు.

సాక్షి :  శిక్షణ ఎలా ఉంటుంది?
శ్రీసత్య : తెలుగు పరిశ్రమ నుంచి మోడల్ ట్రెయినర్ వచ్చి పర్‌ఫెక్ట్ వాక్ నేర్పుతారు. స్టేజీ మీద భయపడకుండా  మాట్లాడటంలో శిక్షణ  ఇస్తారు. అవి మాకు బాగా ఉపయోగపడతాయి.

సాక్షి :  మోడలింగ్ రంగంలోకి ఎలా ప్రవేశించారు?
శ్రీసత్య : నాకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం. పదో తరగతి చదువుకునే రోజుల్లో యానివర్సరీకి స్టేజీ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాను. ఫేర్‌వెల్‌లో కూడా..


 సాక్షి :  చదువును ఎలా బ్యాలె న్స్ చేసుకుంటున్నారు?
శ్రీసత్య : కాలేజీ వారు సహకరిస్తున్నారు. ప్రతి క్లాసులోనూ 89 శాతం మార్కులు వచ్చాయి. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.


 సాక్షి :  ఎటువంటి పాత్రలంటే ఇష్టం..
శ్రీసత్య : ట్రెడిషనల్ క్యారెక్టర్సంటే ఇష్టం. నటనపరంగా ఏదైనా చేస్తాను. మంచి మెసేజ్ ఉండే ఏ చిత్రమైనా ఇష్టమే. విజయవాడలో ఎక్కువగా  మోడలింగ్ చేశాను. అమెజాన్ వాళ్ల మోడలింగ్‌కి సెలక్ట్ అయ్యాను. జనవరి 31న జరగబోయే ‘మిస్ ఆంధ్రప్రదేశ్’ కి ఎంపికయ్యాను.


సాక్షి :  ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలు..
శ్రీసత్య : రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో నన్ను ప్రతిసారీ అతిథిగా పిలుస్తారు. ఆడపిల్లల రక్షణ కోసం పోలీసు వారు రూపొందించిన యాప్ పబ్లిసిటీలో పాల్గొన్నాను. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నాను. ‘మార్క్’ వారు నిర్వహిస్తున్న అనాథాశ్రమాలను సందర్శించాను. ఇద్దరు భార్యాభర్తలు స్వచ్ఛందంగా నడుపుతున్న పిచ్చివారి  అనాథాశ్రమం కూడా చూశాను.


సాక్షి :  ఆనందం కలిగించిన అంశాలు..
శ్రీసత్య : ‘బజ్’ మ్యాగజైన్ వారు నా ఫొటోను కవర్ పేజీలో వేయడం నన్ను బాగా ఆనందింపజేసింది. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యాను.

                    
 
ప్రస్తుతం ‘గోదారి నవ్వింది’ సినిమా చేస్తున్నాను. షూటింగ్ పూర్తవుతోంది. ఈ చిత్రానికి నిర్మాత, డెరైక్టర్ అంతా కొత్తవారే. నేను ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నాను. ‘అందాల వారసుడు’ ఆఫర్ వచ్చింది. ముహూర్తం కూడా అయింది. మరో సినిమా కూడా ఓకే అయింది. ‘లవ్ స్కెచ్’ షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను. ఆ  అనుభవంతో నాకు సినిమాల్లో చేయడం సులువైంది.

- శ్రీసత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement