'నేను శైలజ' మూవీ రివ్యూ | Nenu Sailaja Movie Review | Sakshi
Sakshi News home page

'నేను శైలజ' మూవీ రివ్యూ

Published Fri, Jan 1 2016 1:05 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

'నేను శైలజ' మూవీ రివ్యూ

'నేను శైలజ' మూవీ రివ్యూ

టైటిల్: నేను శైలజ
జానర్: రొమాంటిక్ లవ్ స్టోరీ
తారాగణం: రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: శ్రీ స్రవంతి మూవీస్

చాలా రోజులుగా రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్... రూట్ మార్చి తెరకెక్కించిన సినిమా నేను శైలజ. తన హై ఓల్టేజ్ ఎనర్జీకి భిన్నంగా కాస్త సెటిల్డ్ పెర్ఫామెన్స్తో ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు రామ్. తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై సెకండ్ హ్యాండ్ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ, రామ్ను రొటీన్ హీరో అన్న ఇమేజ్ నుంచి బయటికి తీసుకువస్తుందా.. చాలా రోజలుగా ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కోరిక తీరుస్తుందా..?

కథ :
హరి (రామ్), శైలజ (కీర్తీ సురేష్)ల చిన్నతనంలో సినిమా ప్రారంభమవుతుంది. చిన్నతనంలో ఈ ఇద్దరు స్నేహితులు. అప్పటి నుంచే శైలజ మీద ఎంతో ఇష్టం ఉన్నా, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెడతాడు. ఆ తరువాత ఎంతోమంది అమ్మాయిలకు తన ప్రేమను చెప్పినా.. ఎక్కడా వర్కవుట్ కాదు. దీంతో ప్రేమ మీద విరక్తి చెందిన హరి అమ్మాయిలకు దూరంగా ఉంటుంటాడు. హరి కుటుంబం వైజాగ్ వెళ్లిపోతుంది. హరి, శైలజ పెద్దవాళ్లవుతారు. అక్కడే ఓ పబ్లో డిజెగా పనిచేస్తుంటాడు హరి. వైజాగ్లో హ్యాపీగా గడిపేస్తున్న హరికి మళ్లీ శైలజ కనిపిస్తుంది. అయితే ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు అని గుర్తించని హరి, మరోసారి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన గత అనుభవాల దృష్ట్యా ఆమెకు తన ప్రేమను చెప్పకుండా చాలా కాలం దాచి పెట్టి ఆమెతో స్నేహం చేస్తాడు. ఫైనల్గా ఓ రోజు వాళ్ల గతం గురించి తెలిసిపోతుంది. హరి, శైలజకు తన ప్రేమిస్తున్న విషయం చెపుతాడు. అప్పుడు శైలజ, హరి ప్రేమను అంగీకరించిందా.. తరువాత పరిణామాలేంటి అన్నదే మిగతా కథ.


నటీనటులు:
ఇప్పటివరకు ఎనర్జిటిక్ రోల్స్లో హై ఓల్టేజ్ నటనతో ఆకట్టుకున్న రామ్ ఈ సినిమాలో మాత్రం కాస్త సెటిల్డ్గా కనిపించడానికి ప్రయత్నించాడు. అందుకు తగ్గట్టుగా బాగానే హొం వర్క్ చేసినట్టున్నాడు. నటనతో పాటు డ్యాన్స్లలో కూడా ఎక్కడా పాత రామ్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక శైలజగా కీర్తి సురేష్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. రెగ్యులర్గా చేసే స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్కు భిన్నంగా ప్రదీప్ రావత్ కామెడీ విలనీతో మెప్పించాడు. సత్యరాజ్, విజయ్ కుమార్, నరేష్, సుడిగాలి సుధీర్లు ఆకట్టుకున్నారు. స్పెషల్ క్యారెక్టర్లో కనిపించిన ప్రిన్స్ అలరించాడు.

సాంకేతిక నిపుణులు:
సెకండ్ హ్యాండ్ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన కిశోర్ తిరుమల మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. రామ్ను కొత్తగా చూపించటంలో సక్సెస్ సాధించాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్కు తన మ్యూజిక్తో కొత్త లైఫ్ ఇచ్చే దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేశాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను అద్భుతంగా చూపించాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పరవాలేదనిపించింది. సెకండాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే బాగుండేది. కిశోర్ తిరుమల దర్శకుడిగానే కాక మాటల రచయితగా కూడా మెప్పించాడు. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ తో ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు.

ప్లస్ పాయింట్స్ :
రామ్, కీర్తీ సురేష్
కామెడీ
మ్యూజిక్


మైనస్ పాయింట్స్ :
రొటీన్ నారేషన్
సెకండాఫ్లో కొన్ని సీన్స్

ఓవరాల్గా నేను శైలజ, కొత్తగా కనిపించటం కోసం రామ్ చేసిన మంచి ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement