నానితో శైలజ
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. స్టార్ వారసులిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడినా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్కు రెడీ అవుతోంది. టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న నానికి జోడీగా నటించనుంది కీర్తి.
ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్మేన్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం.
అందుకే గ్లామర్తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాధించిన కీర్తి సురేష్ను ఈ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. నేచురల్ స్టార్గా మంచి ఇమేజ్ ఉన్న నానితో కలిసి నటించడానికి కీర్తి సురేష్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.