teri
-
‘టెరి’ వ్యవస్థాపక డైరెక్టర్ ఆర్కే పచౌరి మృతి
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టెరి)’ మాజీ చీఫ్ ఆర్కే పచౌరి(79) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి పచౌరి వైదొలిగారు. ‘టెరి’కి పచౌరి అందించిన అనుపమాన సేవలను సంస్థ చైర్మన్ నితిన్ దేశాయి ఒక ప్రకటనలో కొనియాడారు. 1974లో ‘టెరి’ని స్థాపించారు. విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది. -
తీన్ మార్?
కొత్త సినిమా కోసం రవితేజ మళ్లీ ఖాకీ డ్రెస్ వేసి లాఠీ చేతపట్టి పోలీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘కనకదుర్గ’ అనే మాస్ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన విజయ్ ‘తేరీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్లే తెలుగులోనూ ఇద్దరి హీరోయిన్స్ ఉన్నారు. ‘క్యాథరీన్’ ఒక హీరోయిన్గా చాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మరో కథానాయికగా కాజల్ అగర్వాల్‌ను టీమ్ ఎంపిక చేసిందని సమాచారం. ఇంతకుముందు ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో రవితేజ–కాజల్ జంటగా నటించారు. ఇప్పుడు కొత్త సినిమాలో ‘తీన్’ మార్ స్టెప్పులేయబోతున్నారన్నమాట. ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. రవితేజ కెరీర్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కృష్ణ’ విజయవాడ నేపథ్యంలోనే ఉంటుందని గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్’ వంటి హిట్ చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి, మెప్పించారు రవితేజ. -
బ్యాక్ టు బ్యాక్
కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ ఇచ్చిన మాస్రాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతోపాటు ‘తేరీ’ రీమేక్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. విజయ్ నటించిన ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శివన్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ అవుతోంది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. లేటెస్ట్గా ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో కేథరిన్ కథానాయిక. తమిళ చిత్రాన్ని తెలుగు నేపథ్యానికి సరిపడేలా దర్శకుడు సంతోష్ శివన్ చాలా మార్పులు చేశారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్న ఈ చిత్రాన్ని దసరా స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు. -
ఇటు ఇండియా అటు అమెరికా
ఉదోగ్యం విషయంలో పక్కాగా ఉంటాడా పోలీస్. తప్పు చేసినవాణ్ని ఎదిరించే విషయంలో అస్సలు లెక్క చేయడు. ఇలాంటి క్యారెక్టర్స్‌ని రవితేజ సునాయాసంగా చేసేస్తారు. ‘విక్రమార్కుడు, మిరపకాయ్’ వంటి సినిమాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారని సమాచారం. తమిళ ‘తేరీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారాయన. ఎందుకంటే ఈ షెడ్యూల్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ (అఅఆ) షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారట. ‘అఅఆ’ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌తో ఇటు ఇండియా అటు అమెరికా షిఫ్ట్ అవుతూ ఉంటారట రవితేజ. -
రజనీ కోసం ఫైట్స్ నేర్చుకున్నా!
ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ ఇప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ . నిజం చెప్పాలంటే తమిళంలో ఈ అమ్మడికి సరైన విజయాలను అందించింది రెండు చిత్రాలే. అందులో ఒకటి తొలి చిత్రం మదరాసుపట్టణం, రెండవది ఈ మధ్య విజయ్‌తో నటించిన తెరి చిత్రం. అయితే శంకర్ దర్శకత్వంలో విక్రమ్‌తో రొమాన్స్ చేసిన ఐ చిత్రం ఎమీకీ బోలెడు ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. మధ్యలో బాలీవుడ్ అనుభవాన్ని పొంది వచ్చిన ఈ ఇంగ్లిష్ భామకు మరోసారి సూపర్‌స్టార్‌తో నటించే అదృష్టం వరించింది. సాధారణంగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఒక సారి ఎంపిక చేసిన నటికి మరోసారి అవకాశం ఇవ్వడం అరుదైన విషయమే. నటి ఐశ్వర్యారాయ్, మనీషాకోయిరాలా తరువాత అలా శంకర్ నుంచి రెండో అవకాశాన్ని అందుకున్న లక్కీ నాయకి ఎమీనే అవుతారు. ఈ అమ్మడు రజనీకాంత్‌తో నటిస్తున్న 2.ఓ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఆ చిత్రం కోసం ప్రత్కేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సూపర్‌స్టార్ కోసం పోరాటాల్లో తర్ఫీదు పొందినట్లు చెబుతున్న ఎమీజాక్సన్ మనోగతం చూద్దాం. నేను చదువుకునే రోజుల్లోనే అంటే 15వ ఏట నుంచే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. అందాల పోటీల్లోనూ చాలా బహుమతులు అందుకున్నాను. అలాంటి సమయంలోనే దర్శకుడు విజయ్ తనను గుర్తించి మదరాసుపట్టణం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ప్రారంభ దశలో భాష తెలియక చాలా కష్టపడ్డాను. నా స్నేహితులు లండన్ లో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే, తాను చెన్నైలో బసచేస్తూ తమిళ భాష నేర్చుకున్నాను. ప్రస్తుతం తమిళం అర్థం చేసుకోగలుగుతున్నాను. చిన్న వయసు నుంచే మోడలింగ్ కారణంగా దేశాలు చుట్టిరావడంతో సినీరంగంలో ఆటంకాలను ఎదుర్కోవడం ఏమంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నేను హిందీ భాషను నేర్చుకున్నాను. అదే విధంగా నన్ను తమిళంతో పాటు అన్ని భాషల అభిమానులు ఆదరిస్తుండడం సంతోషంగా ఉంది. అంతకంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటించడం మరింత ఆనందంగా ఉంది. ఇది భారీ యాక్షన్ కథా చిత్రం. ఇందులో నటించడం కోసం ఫైట్స్‌లో శిక్షణ పొందాను. అందుకు సరైన శరీర దారుఢ్యం కోసం చాలా కసరత్తులు చేశాను. ఆహార నియమాలు పాటించాను. గుడ్లు, మాంసాహారం వంటివి పక్కన పెట్టి పళ్లు, కాయగూరలే తింటున్నాను. శారీరక సౌందర్యంపైనా ప్రత్కేక దృష్టిపెట్టాను. యోగా, ధ్యానం చేస్తున్నాను అన్నారు ఈ భామ. -
బీవీబీపీ ప్రిన్సిపాల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ సీనియర్ ప్రిన్సిపాల్ సీ రమాదేవిని ప్రతిష్టాత్మక సర్చ్ అవార్డు వరించింది. న్యూఢిల్లీలోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఏటా ఓ ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఈ అవార్డును ప్రధానం చేస్తుంది. అందులో భాగంగా 2015 సంవత్సరానికి గాను రమాదేవిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వచ్చే నెల7వ తేదీన న్యూఢిల్లీలో ఈ అవార్డును బహూకరించనున్నారు. గత ఏడేళ్లుగా పర్యావరణం, ఇంధన పొదుపు, పరిసరాల పరిశుభ్రత, రీ-సైక్లింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు సమాజాన్ని కూడా ఉత్తేజపరిచినందుకు రమాదేవికి ఈ అవార్డును ప్రకటించారు. -
ఢిల్లీని దడ దడ లాడిస్తున్న కాలుష్యం
-
ఢిల్లీ కాలుష్య నియంత్రణకు టెరీ ప్రణాళిక
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కాలుష్య నివారణకు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ (టెరీ) సోమవారం పది సూత్రాల అత్యవసర ప్రణాళికను ప్రకటించింది. ఇందులో... పంట దహనాన్ని తగ్గించడం, ఢిల్లీ–ఎన్ సీఆర్‌లో పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లాంటివి ఉన్నాయి. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఈ ప్రణాళికను సమర్పిస్తూ దీన్ని సత్వరమే అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
నేను అమాయకుడిని.. కోర్టుపై నమ్మకముంది!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరి తాజాగా స్పందించారు. ఈ కేసులో తాను అమాయకుడినని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెరి మాజీ చీఫ్ అయిన పచౌరి స్పందిస్తూ 'చార్జీషీట్లోని అభియోగాలను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకానీ నాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఎక్కడా పేర్కొనలేదు. ఫిర్యాదుదారు చేసిన అభియోగాలపై ఏడాది పాటు సాగిన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడి కాలేదు' అని పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసముందని, తాను ఏ తప్పు చేయలేదని, అదే విషయం కోర్టు తీర్పు ద్వారా రుజువు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. పచౌరిపై చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్ ఈ కేసు విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
బలవంతంగా పంపేశారు!
న్యూఢిల్లీ: సహోద్యోగినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరిని టెరి నుంచి బలవంతంగా సెలవులో పంపించారు. ఆయన స్థానంలో నూతన చైర్మన్‌గా అశోక్ చావ్లాను టెరి పాలక మండలి ఎన్నుకుంది. అదేవిధంగా అజయ్ మాథుర్‌కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలు కట్టబెడుతూ కౌన్సిల్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరిని ఇంధన వనరుల సంస్థ (టెరి) చైర్మన్‌గా నియమిస్తూ తాజాగా పాలకమండలి నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది. తన జూనియర్ సహ ఉద్యోగిని తీవ్రంగా లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పచౌరిపై కేసు నమోదుచేసిన ఆమె ప్రస్తుతం టెరికి రాజీనామా చేసింది. ఈ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన పచౌరీని తిరిగి టెరికి తీసుకురావడం తాజా వివాదానికి కారణమైంది. ఆయనపై మరో టెరి ఉద్యోగిని కూడా లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో టెరి వైస్ చైర్మన్‌గా నియమించిన పచౌరిని దీర్ఘకాలిక సెలవుపై బలవంతంగా పంపిస్తూ తాజాగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. -
'ఇలాంటి వాతావరణంలో నేనుండను'
న్యూఢిల్లీ: పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరీపై లైంగిక ఆరోపణలు చేసిన పరిశోధకురాలు ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(తెరా)లో చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేసింది. అనంతరం ఆ సంస్థలోని ఉద్యోగులపై పలు ఆరోపణలు చేసింది. తనను కొంత మేధావి వర్గం చెప్పుకోలేని విధంగా చిన్న చూపు చూస్తున్నారని, ఒక ఉద్యోగినిగా తన ఇష్టాలను గుర్తించడంలో, గౌరవాన్ని కాపాడటంలో తెరా సంస్థ విఫలమైందని రాజీనామా లేఖలో వివరించింది. 'మీరు పచౌరీపై చర్యలు తీసుకునే బదులు ఆయనకు పూర్తిగా రక్షణ కల్పించారు. నేను చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మీరు స్వయంగా వేసిన కమిటీ కూడా తననే అవమానించేలా నివేదిక ఇచ్చింది. ఇక పాలక మండలి కూడా నన్ను ఊహించని విధంగా చిన్నబుచ్చింది. కనీసం ఆయనపై సస్పెండ్ వేటు వేసి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా నేను ఇమడలేనంత వాతావారణాన్ని మీరు కావాలనే సృష్టించారు. అందుకే రాజీనామా చేస్తున్నాను' అంటూ ఆమె వాపోయింది. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పచౌరీ తనను లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు పరిశోధనకారిణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈమెయిల్స్, సంక్షిప్త సందేశాలు, వాట్సాప్ సందేశాల ద్వారా ఎంతో విసిగించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వీటన్నింటిని అప్పుడు పచౌరీ ఖండించారు. తన మెయిల్స్, ఫోన్ నెంబర్స్ హ్యాక్ చేశారని చెప్పారు. -
ఆర్కే పచౌరి 'బాధితురాలు' రాజీనామా!
న్యూఢిల్లీ: ఇంధన వనరుల సంస్థ (టెరి) మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరిపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన మహిళా పరిశోధక నిపుణురాలు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టెరి సంస్థ తనపట్ల అత్యంత ఘోరంగా ప్రవర్తించిందని, అందుకే సంస్థకు రాజీనామా చేస్తున్నానని 29 ఏళ్ల ఆమె రాజీనామా లేఖలో తెలిపారు. ఒక ఉద్యోగిగా తన ప్రయోజనాలకు టెరి మద్దతుగా నిలువలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టెరి డైరెక్టర్‌గా ఆర్కే పచౌరి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత ఫిబ్రవరి 13న ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఏ), 354 (డీ) (వేధింపులు), 506 (క్రిమినల్ బెదిరింపులు) కింద అభియోగాలు మోపారు. దీంతో ఆర్కే పచౌరిని తొలగించి.. ఆయన స్థానంలో డాక్టర్ అజయ్ మధుర్‌ను సంస్థ డైరెక్టర్ జనరల్‌గా టెరి గవర్నర్ కౌన్సిల్ నియమించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆర్కే పచౌరి ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ నుంచి, వాతావరణ మార్పులపై ప్రధానమంత్రి మండలి నుంచి వైదొలిగారు.