జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌! | Amala Paul in Jersey Tamil Remake | Sakshi
Sakshi News home page

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

Aug 14 2019 12:41 AM | Updated on Aug 14 2019 12:42 AM

Amala Paul in Jersey Tamil Remake - Sakshi

‘‘కథాబలం ఉన్న కథలు, బలమైన పాత్రలు రావడంలేదు. అందుకే సినిమాలు వదిలేద్దామనుకున్నా’’ అని ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్‌ చెప్పారు. అయితే కథాబలం ఉన్న స్క్రిప్ట్‌ కావడంతో ‘ఆమె’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమలా పాల్‌కి మరో బలమైన పాత్ర చిక్కింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో అమలా పాల్‌ను కథానాయికగా అడిగారట. తెలుగు సినిమా చూసినవారికి కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అమలా పాల్‌ ఒప్పుకున్నారట. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ రీమేక్‌ని హీరో రానా నిర్మించనున్నారు. నాని పాత్రలో విష్ణు విశాల్‌ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రీమేక్‌ని ‘దిల్‌’ రాజు, నాగవంశీ నిర్మించనున్నారు. ఇంకా తారాగణం ఎంపిక కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement