కోలీవుడ్‌కు మరో శాండిల్ ఉడ్ బ్యూటీ
కోలీవుడ్‌కు మరో శాండిల్ ఉడ్ బ్యూటీ
Published Fri, Feb 14 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
కోలీవుడ్‌కు పరభాషా నటీమణుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నేమ్, ఫేమ్‌తో పాటు పారితోషికం అధికంగానే ముడుతుండటంతో మాలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోయిన్లు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శాండిల్ వుడ్ బ్యూటీ దీపా సన్నిధి కోలీవుడ్ తెరంగేట్రం జరిగింది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన లుసియా చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బురాజ్ శిష్యుడు ప్రసాద్ రామ ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు.
కన్నడంలో శృతిహాసన్ నటించిన పాత్రను తమిళంలో రూపా సన్నిధి పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతా న్ని అందిస్తున్న ఈ చిత్రం ఫిజిలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. తమిళంలో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైందని యూనిట్ వర్గా లు తెలిపాయి. కోలీవుడ్ రంగ ప్రవేశం గురించి నటి దీపా సన్నిధి మాట్లాడుతూ లుసియా చిత్ర తమిళ వెర్షన్లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో తన పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. కన్నడంలో శృతిహాసన్ పోషించిన పాత్రను ధరించే అవకాశం రావడం ఆనందంగా ఉం దన్నారు. అనుభవం గల నటుడు సిద్ధార్థ్‌తో నటించడం ఇంకా సంతోషంగా ఉందన్నా రు. చిత్ర దర్శకుడు ప్రసాద్ రామర్ నుంచి చాలా నేర్చుకుంటున్నానని తెలిపారు. తమిళంలో మరిన్ని చిత్రా లు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త అవకాశాలు వస్తున్నాయని దీపా సన్నిధి పేర్కొన్నారు.
Advertisement
Advertisement