Deepa Sannidhi
-
సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా?
నటుడు సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారన్న వదంతులున్నాయి. తాజాగా వీరి మధ్య ప్రేమ బ్రేకప్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు కారణం నటి దీపా సన్నిధి అంటూ మరో ప్రచారం మొదలైంది. సిద్ధార్థ్, దీపా సన్నిధి జంటగా ఎనక్కుల్ ఒరువన్(నాలో ఒక డు) చిత్రంలో నటిస్తున్నారు. ఇది మలయాళంలో ఘన విజయం సాధించిన లూసియా అనే చిత్రానికి రీమేక్. ప్రసాద్ రామర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీవీ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథనాయకిగా నటించిన దీపా సన్నిధి 24 ఏళ్ల కన్నడ భామ. చిక్ మంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న దీపా సన్నిధితో సిద్ధార్థ్ సన్నిహితంగా మెలుగుతున్నారన్న వార్త జోరందుకుంది. సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ పటాపంచల్ కావడానికి ఇదే కారణమని కోలీవుడ్ టాక్. ఈ విషయం తన దృష్టికి రావడంతో సమంత సిద్ధార్థ్‌ను నిలదీసినట్టు, చివరకు తమ ప్రేమకు బ్రేక్ వేసుకున్నట్టు సమాచారం. నటి దీపా సన్నిధి మాత్రం తాను ఆ ఇద్దర్నీ విడదీయలేదని పేర్కొనడం గమనార్హం. -
ఆర్యతో డేటింగా?
నటుడు ఆర్యతో డేటింగ్ గాసిప్స్ లిస్ట్‌తో కొత్తగా మరో తార చేరింది. ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న హీరోయిన్లతో డేటింగ్ అంటూ జరిగే ప్రచారం రోజు గురించి గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు. నయనతార, అనుష్క నుంచి, ఈతరం హీరోయిన్లు హన్సిక, నజ్రియాల వరకు ఆర్యతో చెట్టాపట్టాలంటూ వదంతులు రావడం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కన్నడ నటి దీపా సన్నిధి చేరింది. ఈ బ్యూటీ ఆర్యతో కలిసి యట్చకన్ అనే చిత్రంలో నటిస్తోంది. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా కృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో దీపాసన్నిధి, ఆర్యల డేటింగ్ గురించి కోలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంపై దీపా సన్నిధి స్పందిస్తూ ఇలాంటి వదంతులు నిజంగా నవ్వు పుట్టిస్తున్నాయని పేర్కొంది. యట్చకన్ చిత్రం కోసం తానిప్పటి వరకు నాలుగు రోజులే పని చేశానని తెలిపింది. ఇంతలోనే ఆ చిత్ర హీరో ఆర్యతో డేటింగ్ అంటూ ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉంది. కన్నడంలో ప్రాచుర్యం పొందిన ఈ భామ తమిళంలో మరో చిత్రం కూడా చేస్తోంది. కన్నడంలో విజయం సాధించిన లూసియా చిత్రం తమిళ రీమేక్‌లో దీపా సన్నిధినే హీరోయిన్. సిద్దార్థ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం గురించి దీపా సన్నిధి మాట్లాడుతూ కన్నడ చిత్రం లూసియా తాను ముందుగానే చూశానని చెప్పింది. ఈ చిత్రం కోసం అడిషన్లో పాల్గొనే ముందే ఒరిజినల్ చిత్రం చూడటం చాలా హెల్ప్ అయ్యిందని తెలిపింది. తనకు తమిళ భాష బాగానే అర్థం అవుతుందని తెలిపింది. పెద్ద డైలాగ్స్ ఉంటే రిహార్సల్స్ చేసుకుని నటిస్తానని అంటున్న దీపా సన్నిధికి కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఈ కన్నడ బ్యూటీ సెప్టెంబర్‌లో మరో తమిళ చిత్రం అంగీకరించనున్నట్లు తెలిపింది. -
కోలీవుడ్‌కు మరో శాండిల్ ఉడ్ బ్యూటీ
కోలీవుడ్‌కు పరభాషా నటీమణుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నేమ్, ఫేమ్‌తో పాటు పారితోషికం అధికంగానే ముడుతుండటంతో మాలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోయిన్లు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శాండిల్ వుడ్ బ్యూటీ దీపా సన్నిధి కోలీవుడ్ తెరంగేట్రం జరిగింది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన లుసియా చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బురాజ్ శిష్యుడు ప్రసాద్ రామ ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు. కన్నడంలో శృతిహాసన్ నటించిన పాత్రను తమిళంలో రూపా సన్నిధి పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతా న్ని అందిస్తున్న ఈ చిత్రం ఫిజిలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. తమిళంలో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైందని యూనిట్ వర్గా లు తెలిపాయి. కోలీవుడ్ రంగ ప్రవేశం గురించి నటి దీపా సన్నిధి మాట్లాడుతూ లుసియా చిత్ర తమిళ వెర్షన్లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో తన పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. కన్నడంలో శృతిహాసన్ పోషించిన పాత్రను ధరించే అవకాశం రావడం ఆనందంగా ఉం దన్నారు. అనుభవం గల నటుడు సిద్ధార్థ్‌తో నటించడం ఇంకా సంతోషంగా ఉందన్నా రు. చిత్ర దర్శకుడు ప్రసాద్ రామర్ నుంచి చాలా నేర్చుకుంటున్నానని తెలిపారు. తమిళంలో మరిన్ని చిత్రా లు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త అవకాశాలు వస్తున్నాయని దీపా సన్నిధి పేర్కొన్నారు.