సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా? | Deepa Sannidhi reason for Samantha-Siddharth splitఝ | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా?

Published Wed, Jan 14 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా?

సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా?

నటుడు సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారన్న వదంతులున్నాయి. తాజాగా వీరి మధ్య ప్రేమ బ్రేకప్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు కారణం నటి దీపా సన్నిధి అంటూ మరో ప్రచారం మొదలైంది. సిద్ధార్థ్, దీపా సన్నిధి జంటగా ఎనక్కుల్ ఒరువన్(నాలో ఒక డు) చిత్రంలో నటిస్తున్నారు. ఇది మలయాళంలో ఘన విజయం సాధించిన లూసియా అనే చిత్రానికి రీమేక్. ప్రసాద్ రామర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీవీ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథనాయకిగా నటించిన దీపా సన్నిధి 24 ఏళ్ల కన్నడ భామ.

చిక్ మంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న దీపా సన్నిధితో సిద్ధార్థ్ సన్నిహితంగా మెలుగుతున్నారన్న వార్త జోరందుకుంది. సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ పటాపంచల్ కావడానికి ఇదే కారణమని కోలీవుడ్ టాక్. ఈ విషయం తన దృష్టికి రావడంతో సమంత సిద్ధార్థ్‌ను నిలదీసినట్టు, చివరకు తమ ప్రేమకు బ్రేక్ వేసుకున్నట్టు సమాచారం. నటి దీపా సన్నిధి మాత్రం తాను ఆ ఇద్దర్నీ విడదీయలేదని పేర్కొనడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement