ఒకమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు | mupparimanam remake in telugu | Sakshi

ఒకమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు

Feb 28 2019 2:44 AM | Updated on Feb 28 2019 2:44 AM

mupparimanam remake in telugu - Sakshi

శంతన్, సృష్టి డాంగే

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్‌ భాగ్యరాజా, సృష్టి డాంగే జంటగా నటించిన తమిళ చిత్రం ‘ముప్పరి మనమ్‌’. ఆది రూపన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భాను క్రియేషన్స్‌ పతాకంపై భువన్‌ కుమార్‌ అల్లం ‘లవ్‌ గేమ్‌’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్‌ సినిమా నిర్మించాను. తమిళంలో దాదాపు 40 చిత్రాలకు పైగా చూసి శంతన్‌ భాగ్యరాజా నటించిన ‘ముప్పరి మనమ్‌’ చిత్రం నచ్చడంతో ‘లవ్‌ గేమ్‌’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం.

ప్రెజెంట్‌ ట్రెండ్‌కి కనెక్టయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. తెలుగులో ఇప్పుడు ఇలాంటి చిత్రాల హవా నడుస్తోంది. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరు అబ్బాయిలతో ఎలా గేమ్‌ ఆడిందనేది కథ. వెన్నెలకంటిగారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. మార్చి 2న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరపనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటి రమ్యకృష్ణ, నటుడు, దర్శకుడు భాగ్యరాజా, హీరో సందీప్‌ కిషన్, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు హాజరు కానున్నారు. మార్చి 8న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement