Srushti Dange
-
మత్తెక్కిస్తున్న దివ్యభారతి.. డింపుల్ బ్యూటీ వయ్యారాల వల!
రీసెంట్ సెన్సేషనల్ బ్యూటీ వామికా హాట్ పిక్స్ స్విట్జర్లాండ్ చెక్కేసిన 'యానిమల్' బ్యూటీ తృప్తి బీచ్ ఒడ్డున దివ్యభారతి బ్యూటీఫుల్ ఫొటోలు బోలెడంత గ్లామర్ చూపిస్తున్న నేహా ధూపియా నవ్వుతూ చంపేస్తున్న 'చంద్రముఖి-2' బ్యూటీ చీరలో క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న చైత్ర జే ఆచార్ బ్లాక్ డ్రస్‌లో ధగధగా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్ బ్యాక్ చూపిస్తూ హొయలు పోతున్న హీరోయిన్ తమన్నా View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసే యుద్ధం 'వీరఖడ్గం'
సృష్టిడాంగే ప్రధాన పాత్రలో ఎమ్ఏ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరఖడ్గం’. బ్రహ్మానందం, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఎమ్ఏ చౌదరి మాట్లాడుతూ.. ‘‘చరిత్ర శిథిలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి.. పగ కూడా అంతే. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు లైన్‌ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ సునీల్‌కుమార్. -
ఆమెకు దానిపై ఆశ పుట్టింది
సినిమా: నటి సృష్టిడాంగేకు పెళ్లిపై ఆశ పుట్టినట్లుంది. మెగా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఉత్తరాది బ్యూటీ సృష్టిడాంగే. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. అయితే ఇంకా స్టార్‌డమ్‌ను అందుకోలేదు. అందుకోసమే తపిస్తోంది. తన నట జీవితంలో గుర్తుండిపోయే కథా పాత్ర కోసం ఎదురుచూస్తోంది. అయితే అలాగని వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న చందంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అలా ఆ మధ్య విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ధర్మదురై చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. అదే విధంగా ఇటీవల దర్శకుడు చేరన్ ప్రధాన పాత్రలో నటించిన రాజావుక్కు చెక్ చిత్రంలో నగ్నంగా నటించి చర్చనీయాంశంగా మారింది. అలా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు వరించకపోయినా, వరుసగా చిత్రాల్లో నటిస్తూనే ఉంది. తమిళంతో పాటు, కన్నడం ఇతర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆరికి జంటగా కొత్త చిత్రంలో నటిస్తోంది. కట్టిల్ అనే మరో చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సృష్టిడాంగే చెబుతూ ఈ చిత్రం ద్వారా తనకు తెలియని తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నానని చెప్పింది. దీంతో తమిళ సంప్రదాయంపై ప్రేమను ఇంకా పెంచేసిందని అంది. అది ఎంత వరకు అంటే తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందని ఈ ముంబై భామ చెప్పుకొచ్చింది. సృష్టిడాంగే చెబుతున్నదాంట్లో నిజం ఎంత అన్నది నెటిజన్లు ఆరా లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదో పబ్లిసిటీ స్టంటా లేక ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లిందా అన్న చర్చ కూడా సినీ వర్గాల్లో జరుగుతోంది. -
నాన్నలానే నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్ భాగ్యరాజా హీరోగా ఆది రూపన్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘ముప్పరి మనమ్’. సృష్టిడాంగే కథానాయికగా నటించారు. ఈ సినిమా ‘లవ్ గేమ్’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ధను క్రియేషన్స్ పతాకంపై భువన్ కుమార్ అల్లం అనువదించారు. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తేజ మాట్లాడుతూ– ‘‘నేను భాగ్యరాజాగారికి పెద్ద అభిమానిని. నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలన్నీ చూసేవాడిని. వాళ్ల అబ్బాయి సినిమా ఇక్కడ రిలీజై మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండియాలోనే జీనియస్ డైరెక్టర్ భాగ్యరాజాగారు. ఆది రూపన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ‘లవ్‌గేమ్’ చిత్రం తెలుగులో సక్సెస్ కావాలి’’ అన్నారు నటి రమ్యకృష్ణ. ‘‘భాగ్యరాజాగారి స్థాయిలో వారి తనయుడు శంతన్ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ ‘లవ్‌గేమ్’ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు రాజశేఖర్. ‘‘ఈ వేడుకకు రావడం చాలా హ్యాపీగా ఉంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు జీవిత రాజశేఖర్. ‘‘నా డబ్బింగ్ చిత్రాలన్నీ తెలుగులో సూపర్‌హిట్ సాధించాయి. ఇప్పుడు మా అబ్బాయి నటించిన తమిళ చిత్రం తెలుగులో ‘లవ్‌గేమ్’ పేరుతో విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భాగ్యరాజా. ‘‘నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ చిత్రం నచ్చింది. రచయిత వెన్నెలకంటిగారు నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచారు. ఈ చిత్రం తెలుగులో పెద్ద హిట్ కావాలి’’ అన్నారు భువన్‌కుమార్. ‘‘30ఏళ్ల నుంచి నాన్నగారిని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో ఉన్న మంచి పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. దర్శకుడు అద్భుతంగా తీశారు’’ అన్నారు శంతన్ భాగ్యరాజా. డైరెక్టర్లు కరుణాకరన్, చంద్రమహేశ్, అనిల్ రావిపూడిలతో పాటు నటుడు సందీప్ కిషన్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఒకమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్ భాగ్యరాజా, సృష్టి డాంగే జంటగా నటించిన తమిళ చిత్రం ‘ముప్పరి మనమ్’. ఆది రూపన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భాను క్రియేషన్స్ పతాకంపై భువన్ కుమార్ అల్లం ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్ సినిమా నిర్మించాను. తమిళంలో దాదాపు 40 చిత్రాలకు పైగా చూసి శంతన్ భాగ్యరాజా నటించిన ‘ముప్పరి మనమ్’ చిత్రం నచ్చడంతో ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం. ప్రెజెంట్ ట్రెండ్‌కి కనెక్టయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. తెలుగులో ఇప్పుడు ఇలాంటి చిత్రాల హవా నడుస్తోంది. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరు అబ్బాయిలతో ఎలా గేమ్ ఆడిందనేది కథ. వెన్నెలకంటిగారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. మార్చి 2న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటి రమ్యకృష్ణ, నటుడు, దర్శకుడు భాగ్యరాజా, హీరో సందీప్ కిషన్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు హాజరు కానున్నారు. మార్చి 8న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
జ్యోతిక స్థానాన్ని అందుకోవాలి
సమంత, హన్సిక, శ్రుతిహాసన్ లాంటి వాళ్లు భారీ చిత్రాల అవకాశాలను కైవశం చేసుకు కోవడానికి పోటీ పడుతుంటే చిన్న చిత్రాలను దక్కించుకుంటూ కోలీవుడ్‌లో కథానాయికగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది నటి సృష్టి డాంగే. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అయితే ఈమెకు ఆశలు మాత్రం చాలానే ఉన్నాయి. సృష్టితో చిట్‌చాట్. ప్రశ్న: చిన్న చిత్రాల లక్కీ నాయికగా మారినట్లున్నారే? జవాబు: ఉన్నైప్పోల్ ఒరువన్, డార్లింగ్ చిత్రాల్లో నటించాను. అవి పెద్ద బడ్జెట్ చిత్రాలే. ప్రస్తుతం విల్‌అంబు, నవరస తిలగన్, అచ్చమిండ్రి చిత్రాలు చేతిలో ఉన్నాయి. కత్తుకుట్టి చిత్రం గురువారం తెరపైకొచ్చింది. అయితే నా వరకూ చిన్న చిత్రాలు, పెద్ద చిత్రాలు అన్న తారతమ్యాలు చూపించడం లేదు. కథా పాత్ర బాగుంటే నటించడానికి అంగీకరిస్తున్నారు. ప్రశ్న: పారితోషికం విషయంలో పెద్దగా డిమాండ్ చేయడం లేదట? జ: అవునా? అయితే అది మంచి విషయమేగా. ఆ విధంగా మంచి పేరే తెచ్చుకుంటున్నానుగా. ఇంకో విషయం ఏమిటంటే నాకు ఇంత పారితోషికం కావాలని ఇప్పటివరకూ ఏ నిర్మాతనూ అడగలేదు. నేను ఆశించని విధంగా నిర్మాతలు పారితోషికం చాలానే ఇస్తున్నారు. ఇక ఒక కథానాయికకు ఏమేమి కావాలో అవి మాత్రం అడిగి పొందుతున్నాను. ప్రశ్న: కొత్త హీరోయిన్ల రాక అధికంగా ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయం? జ: ఇప్పుడు చిత్రాలు అధికంగానే తయారవుతున్నాయి. దీంతో కొత్త హీరోయిన్లు ఎక్కువగానే పరిచయం అవుతున్నారు. అయితే ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకోవడం కష్టమైన విషయమే.అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. మంచి గుర్తింపు పొందే ఒక్క చిత్రం అందరు నూతన హీరోయిన్లకు అమరాలి. అప్పుడే తమకంటూ ఒక స్థాయిని అందుకోగలరు. ప్రశ్న: మీరు గ్లామర్ విషయంలో హద్దుల్లాంటివి పెట్టుకున్నట్లు లేదే? జ: బికినీ దుస్తుల్లో నా స్టిల్ చూసి మీరు ఇలాంటి అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. ఒక చిత్రానికి సంబంధించిన స్టిల్ అది. నిజానికి ఆ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవు. చిత్ర ప్రచారం కోసం ఆ స్టిల్స్ వాడుకుంటున్నారు. అది బాధాకరమైన విషయమే.ఆ చిత్రం గురించి మాట్లాడడమే ఇష్టం లేదు. ఇక గ్లామర్ విషయం అంటారా అందుకు నా హద్దులు నాకున్నాయి. ప్రశ్న: మీరు ఏ హీరోయిన్ స్థానాన్ని పొందాలనుకుంటున్నారు? జ: ఈ అమ్మాయి ఇండ స్ట్రీలో ఒక రౌండ్ చుట్టేస్తుంది అని నన్ను చూసి చాలా మంది అన్నారు.అలాంటి మాటల్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నా రోల్ మోడల్ జ్యోతిక మేడమ్.ఆమె స్థానాన్ని అందుకోవాలన్నది నా ఆశ. -
బిజీబిజీగా శ్రుష్టి డాంగే
చిత్రపరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు? ఎలా మారుతుందో తెలియదు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే వర్ధమాన నటి శ్రుష్టిడాంగే టైమ్ బాగుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన యుద్ధం సెయ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి శ్రుష్టిడాంగే. అయితే ఈ భామకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం మేగా. ఈ చిత్రంలో తన నటన సినీ ప్రముఖుల్ని ఆకర్షించిందంటున్న శ్రుష్టి ఎనకుళ్ ఒరువన్, పురియాద ఆనందం పుదిదాగ ఆరంభం చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయని అంది. ప్రస్తుతం దర్శకుడు సుశీంద్రన్ నిర్మిస్తున్న విల్‌అంబు, నరేన్ సరసన కత్తుకుట్టి, ఎంకేపీ.ఆనంద్‌కు జంటగా నవరసతిలగన్, విజయ్ వసంతన్తో అచ్చిమిండ్రు, ప్రసన్న, కలైఅరసన్ నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం అంటూ అరడజను పైగా చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్రలు పోషిస్తునట్లు పేర్కొన్నారు. కోలీవుడ్‌లో ఆదరణ బాగుందని మంచి అవకాశాలు వస్తున్నాయని శ్రుష్టి డాంగే అన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చికోవాలన్నదే తన కోరిక అని శ్రుష్టి అంటున్నారు.