నాన్నలానే నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను | shanthanu bhagyaraj new movie is love game | Sakshi
Sakshi News home page

నాన్నలానే నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను

Published Tue, Mar 5 2019 1:23 AM | Last Updated on Tue, Mar 5 2019 1:23 AM

shanthanu bhagyaraj new movie  is love game - Sakshi

chi

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్‌ భాగ్యరాజా హీరోగా ఆది రూపన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘ముప్పరి మనమ్‌’. సృష్టిడాంగే కథానాయికగా నటించారు. ఈ సినిమా ‘లవ్‌ గేమ్‌’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ధను క్రియేషన్స్‌ పతాకంపై భువన్‌ కుమార్‌ అల్లం అనువదించారు. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తేజ మాట్లాడుతూ– ‘‘నేను భాగ్యరాజాగారికి పెద్ద అభిమానిని. నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలన్నీ చూసేవాడిని.

వాళ్ల అబ్బాయి సినిమా ఇక్కడ రిలీజై మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండియాలోనే జీనియస్‌ డైరెక్టర్‌ భాగ్యరాజాగారు. ఆది రూపన్‌ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ‘లవ్‌గేమ్‌’ చిత్రం తెలుగులో సక్సెస్‌ కావాలి’’ అన్నారు నటి రమ్యకృష్ణ. ‘‘భాగ్యరాజాగారి స్థాయిలో వారి తనయుడు శంతన్‌ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ ‘లవ్‌గేమ్‌’ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు రాజశేఖర్‌. ‘‘ఈ వేడుకకు రావడం చాలా హ్యాపీగా ఉంది. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు జీవిత రాజశేఖర్‌. ‘‘నా డబ్బింగ్‌ చిత్రాలన్నీ తెలుగులో సూపర్‌హిట్‌ సాధించాయి. ఇప్పుడు మా అబ్బాయి నటించిన తమిళ చిత్రం తెలుగులో ‘లవ్‌గేమ్‌’ పేరుతో విడుదల అవుతుంది.

ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భాగ్యరాజా. ‘‘నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ చిత్రం నచ్చింది. రచయిత వెన్నెలకంటిగారు నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచారు. ఈ చిత్రం తెలుగులో పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు భువన్‌కుమార్‌. ‘‘30ఏళ్ల నుంచి నాన్నగారిని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో ఉన్న మంచి పాయింట్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుందనుకుంటున్నాను. దర్శకుడు అద్భుతంగా తీశారు’’ అన్నారు శంతన్‌ భాగ్యరాజా. డైరెక్టర్లు కరుణాకరన్, చంద్రమహేశ్, అనిల్‌ రావిపూడిలతో పాటు నటుడు సందీప్‌ కిషన్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement