బిజీబిజీగా శ్రుష్టి డాంగే | Srushti Dange is a busy | Sakshi
Sakshi News home page

బిజీబిజీగా శ్రుష్టి డాంగే

Published Sat, Jul 25 2015 2:26 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

బిజీబిజీగా శ్రుష్టి డాంగే - Sakshi

బిజీబిజీగా శ్రుష్టి డాంగే

చిత్రపరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు? ఎలా మారుతుందో తెలియదు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే వర్ధమాన నటి శ్రుష్టిడాంగే టైమ్ బాగుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన యుద్ధం సెయ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి శ్రుష్టిడాంగే. అయితే ఈ భామకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం మేగా. ఈ చిత్రంలో తన నటన సినీ ప్రముఖుల్ని ఆకర్షించిందంటున్న శ్రుష్టి ఎనకుళ్ ఒరువన్, పురియాద ఆనందం పుదిదాగ ఆరంభం చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయని అంది.
 
  ప్రస్తుతం దర్శకుడు సుశీంద్రన్ నిర్మిస్తున్న విల్‌అంబు, నరేన్ సరసన కత్తుకుట్టి, ఎంకేపీ.ఆనంద్‌కు జంటగా నవరసతిలగన్, విజయ్ వసంతన్‌తో అచ్చిమిండ్రు, ప్రసన్న, కలైఅరసన్ నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం అంటూ అరడజను పైగా చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్రలు పోషిస్తునట్లు పేర్కొన్నారు. కోలీవుడ్‌లో ఆదరణ బాగుందని మంచి అవకాశాలు వస్తున్నాయని శ్రుష్టి డాంగే అన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చికోవాలన్నదే తన కోరిక అని శ్రుష్టి అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement