మరో చిత్రానికి ఓకే చెప్పిన రజనీ | Rajinikanth to remake Bhaskar The Rascal after 2.0 ?? | Sakshi
Sakshi News home page

మరో చిత్రానికి ఓకే చెప్పిన రజనీ

Published Sat, Feb 20 2016 2:43 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

మరో చిత్రానికి ఓకే చెప్పిన రజనీ - Sakshi

మరో చిత్రానికి ఓకే చెప్పిన రజనీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.ఈ చిత్రం 2018లో తెరపైకి రానుందనే టాక్ కూడా వినిపిస్తోంది.రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న సంగతి విదితమే.అందులో ఒకటి కబాలి. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. కబాలి ఈ ఏడాది మే నెల తరువాత తెరపైకి రానున్నట్లు సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం మరో భారీ చిత్రం 2.ఓ చిత్ర చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. 2018లో చిత్రాన్ని విడుదల చేయడానికి సూపర్‌స్టార్ తాజా చిత్రానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మలయాళంలో మమ్ముటీ,నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ రీమేక్‌లో రజనీకాంత్ నటించనున్నారన్నది సమాచారం. దీనికి సిద్ధిక్ దర్శకుడు.

పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వారి పిల్లల క్షేమం ఇతివృత్తంగా రూపొందిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం మలయాళంలో గత ఏడాది విడుదలై విశేష విజయా న్ని సొంతం చేసుకుంది.ఈ చిత్ర రీమేక్‌లో రజనీకాంత్ న టించడానికి అంగీకరించిన ట్లు ఆ చిత్ర దర్శకుడు సిద్ధిక్ ఒక భేటీలో పేర్కొన్నట్లు మ లయాళ పత్రికలు ప్రచారం చేశాయి. ఈ చిత్రం 2017 ద్వితీ యార్థంలో సెట్‌పైకి వెల్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement