మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ | Anumol to act in Shutter's Tamil remake | Sakshi
Sakshi News home page

మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ

Published Wed, Feb 25 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ

మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ

 కోలీవుడ్‌కు మాలీవుడ్ నాయకిల దిగుమతి కొనసాగుతోంది. ఆసిన్, నయనతారల నుంచి ఈ తరం లక్ష్మీమీనన్‌ల వరకు కోలీవుడ్‌లో జయించిన మలయాళీ భామలే. ఈ వరసలో తాజాగా అనుమోల్ చేరనుంది. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళంలో మంచి నటిగా ప్రకాశిస్తోంది. కాగా పరిశ్రమలో సినీ ఎడిటర్లు దర్శకులైన సంఘటనలు అరుదు. అయితే దర్శకత్వానికి ఎడిటింగ్‌కు చాలా అనుబంధం ఉంటుంది. చిత్రీకరణలో దర్శకుడు ఆశించిన అవుట్‌పుట్ రాకపోయినా ఎడిటింగ్‌లో సాధ్యమైనంత వరకు తన భావాలకనుగుణంగా మలచుకోవచ్చు. ఎడిటింగ్‌లో అంత విషయం ఉందన్నమాట. ఎడిటింగ్‌లో నేర్పరి అయితే దర్శకత్వంలో సులభంగా రాణించవచ్చు.
 
 అలాంటి ధైర్యంతోనే ఏమో యువ ఎడిటర్ ఆంటోని మెగాఫోన్ పట్టడానికి సాహసిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఈయన మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ చిత్ర తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక వేశ్య ఇతివృత్తంతో కూడిన చిత్రం. మలయాళంలో ఈ పాత్రను సజిత మరత్తిల్ పోషించారు. కేరళ ప్రభుత్వ అవార్డును పొందిన ఈ చిత్ర తమిళ రీమేక్‌లో మలయాళకుట్టి అనుమోల్ నటించడానికి సిద్ధం అవుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. దర్శకుడు విజయ్ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement