
జయం రవి
తమిళ హీరో ‘జయం’ రవి సీక్రెట్ ఆపరేషన్ ఏదో చేయడానికి రెడీ అవ్వబోతున్నారట. మరీ.. అంత సీక్రెట్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? అనే విషయానికి ‘బేబి’ రూపంలో సీల్వర్ స్క్రీన్‌పైనే సమాధానం దొరకుతుందని కోలీవుడ్ టాక్. ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘బేబి’. ఈ సినిమాలో అక్షయ్ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసెస్ వింగ్) ఏజెంట్‌గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయబోతున్నారట.
ఇందులో అక్షయ్ పాత్రలో కనిపించనున్నారట ‘జయం’ రవి. అహ్మద్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాకు మధి కెమెరామేన్‌గా వర్క్ చేయబోతున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే శక్తి సుందర్‌రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా రూపొందిన ‘టిక్. టిక్. టిక్’ చిత్రం జనవరి 26న విడుదల కాలేదు. ‘‘రిపబ్లిక్ డే రోజున టిక్.టిక్.టిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ఎనౌన్స్ చేస్తాం’’ అన్నారు ‘జయం’ రవి.
Comments
Please login to add a commentAdd a comment