
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు. రాజకీయాలతో బిజీ అవడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇక మీదట సినిమాల్లో నటించను. కమల్ హాసన్ సర్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్నుంచి తప్పుకుంటున్నాను. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న మామన్నాన్(Maamannan) నా చివరి చిత్రం' అని చెప్పారు.
కాగా ఉదయనిధి స్టాలిన్.. 2012లో ఒరు కాల్ ఒరు కన్నడి(ఓకే ఓకే) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారాయన. కానీ ఈ చిత్రం మరే సినిమాలోనూ నటించకూడదనుకున్నారు. అయితే తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చడంతో నో చెప్పలేక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు. అలాగే రెడ్ జియాంట్ మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా ఈ బ్యానర్‌లో నిర్మితమవుతున్నదే!
చదవండి: బుల్లితెర నటి సీక్రెట్ మ్యారేజ్, ఫొటోలు, వీడియోలు వైరల్
డబ్బులెక్కువయ్యాయి, కసి తగ్గింది.. అందుకే అక్కడ సినిమాలు ఫ్లాప్: రాజమౌళి
Comments
Please login to add a commentAdd a comment