
ఉదయనిధిస్టాలిన్
పెరంబూరు: నటుడు ఉదయనిధి స్టాలిన్ ఓ దివ్యాంగుడికి ఆర్ధిక సాయం అందించారు. తంజై టౌన్, కరంబై ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు అరుళ్ సహాయరాజ్. అదే ప్రాంతంలో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో నటుడు ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరుతూ ఆయన అభిమాన సంఘం ద్వారా లేక రాశారు. సోమవారం తంజైలో జరిగిన ఒక వివాహవేడుకలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని అరుణ్ సహాయరాజ్ ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అరుళ్ సహాయరాజ్ ఆనందంతో కంట తడిపెట్టాడు. ‘తాను ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరాను గానీ, ఆయన ఇలా స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేస్తారని ఊహించలేదు’అన్నాడు.