
‘ఇస్మార్ట్ శంకర్’తో పెద్ద మాస్ హిట్ అందుకున్న నిధీ అగర్వాల్ మంచి జోష్‌లో ఉన్నారు. తమిళంలో వరుస సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ‘జయం’ రవి నటించిన ‘భూమి’తో తొలిసారి తమిళంలో కనిపించబోతున్నారు నిధి. ఈ సినిమా దీపావళికి ఓటీటీలో విడుదల కానుంది. ఆ తర్వాత శింబు చేసిన ‘ఈశ్వరన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారామె. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా మూడో సినిమా కూడా కమిట్ అయ్యారీ బ్యూటీ. ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారామె. తమిళంలో వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టడమే కాదు తమిళం నేర్చుకోవడం మీద కూడా శ్రద్ధపెట్టారట నిధీ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment