లక్నో:మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు సెక్షన్ 295ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధిలు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీడియా కథనాలను ఆధారాలుగా చూపుతూ మతపరమైన భావాలను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
The FIR came at the complaint of lawyers who highlighted media reports on Stalin's statement alleging that the politician's comments had hurt their feelings.https://t.co/7jPY2h9UvS
— IndiaToday (@IndiaToday) September 6, 2023
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..
సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.
ఇదీ చదవండి: అక్కడ సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
Comments
Please login to add a commentAdd a comment