
పాయల్ రాజ్‌పుత్
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడామె పెళ్లిపీటలు ఎక్కేశారు. ఇక్కడి వరకూ చదివిన పాయల్ ఫ్యాన్స్ పరేషాన్ అవ్వక తప్పుదు. ముందుకెళ్లండి అసలు విషయం తెలుస్తుంది. తెలుగులో ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పాయల్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో నటించేందుకు అంగీరించిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కే.ఎస్. అధియామన్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతోంది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు పాయల్. ముందుగా ఉదయ్, పాయల్‌లపై పెళ్లినాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని ఓ సీన్ కోసం పాయల్ పెళ్లి కూతురయ్యారు. ఈ చిత్రానికి ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ‘‘నా తొలి తమిళం సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఆశిస్తున్నాను. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు పాయల్ రాజ్‌పుత్.
Comments
Please login to add a commentAdd a comment