పబ్లిసిటీ స్టంట్‌ అయితే ఏంటి? | Anurag Kashyap Applauds Deepika Padukone Over JNU Visit | Sakshi
Sakshi News home page

దీపిక నిర్మాత.. పబ్లిసిటీ స్టంట్‌ అయితే ఏంటి?

Published Thu, Jan 9 2020 12:51 PM | Last Updated on Thu, Jan 9 2020 3:06 PM

Anurag Kashyap Applauds Deepika Padukone Over JNU Visit - Sakshi

న్యూఢిల్లీ: ‘ఇది పబ్లిసిటీ స్టంట్‌ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు’ అంటూ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత  అనురాగ్‌ కశ్యప్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్‌ ప్రమోషన్‌ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్‌ చేస్తూ.. సినిమాకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. (‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’ )

ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్‌ మాట్లాడుతూ... ‘ఆయిషీ ఘోష్‌ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు.. ‘నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను’ అని చెప్పడం. తన చర్య ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీపిక.. జేఎన్‌యూకు వెళ్లడం ద్వారా ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారుమ్రోగిపోతుంది’ అని దీపికపై ప్రశంసలు కురిపించాడు. తను ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తిపోయిన ప్రజలు... దానిని దాటుకుని ముందుకు సాగుతారని అభిప్రాయపడ్డాడు. (ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు: దీపికకు కేంద్రం అండ)

ఇక అనురాగ్‌ కశ్యప్‌ సైతం ట్రోలింగ్‌ బాధితుడన్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ.. మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోను ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో దీపిక ఫొటో పెట్టి మరోసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. కాగా మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల​ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్‌.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక ఓ నిర్మాతగా వ్యవహరించాన్న సంగతి తెలిసిందే.(ప్రొఫైల్‌ పిక్‌ మార్చిన డైరెక్టర్‌.. ట్రోలింగ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement