న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం జరిగిన ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ స్పందిస్తూ..ఢిల్లీలో జరిగిన హింస నన్ను షాక్‌కు గురిచేసిందని అన్నారు. విద్యార్థులను దారుణంగా కొట్టారని..పోలీసులు హింసను వదిలి శాంతిని నెలకొల్పాలని సూచించారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్ధులకు భద్రత లేనప్పుడు..దేశం ముందుకు ఎలా వెళ్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఆదివారం జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం, ఏబీవీపీ మద్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించగా, లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులే హింసకు కారణమని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment