సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లైంగిక దాడులు, వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా జేఎన్‌యూ విద్యార్థి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. నిందితుడిని మహ్మద్ కశ్మీరీగా గుర్తించామని..వీరిద్దరూ స్నేహితులేనని పోలీసులు చెప్పారు. గత కొంతకాలంగా కశ్మీరీని బాధిత యువతి పట్టించుకోవడం లేదని సమాచారం.
తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తెస్తుండగా అందుకామె నిరాకరించడంతో కశ్మీరీ కక్ష గట్టాడని పోలీసులు వెల్లడించారు. ఇదే విషయమై ఆమెతో వాదనకు దిగిన కశ్మీరీ ఆవేశంతో ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడికి దిగాడు. బాధితురాలు వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment