సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలతో స్వైర విహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్‌యూ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ముసుగు ధరించిన కొందరు దుండగులను గుర్తించారు.
క్యాంపస్‌లో కొన్ని గంటల పాటు చెలరేగిన దుండగుల దాడిలో 34 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తణమే నివేదిక సిద్ధం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మాట్లాడిన అమిత్ షా వర్సిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఏబీవీపీ కార్యకర్తలే ముసుగు దాడులకు పాల్పడి క్యాంపస్‌లో అరాచకం సృష్టించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment