
న్యూఢిల్లీ: రాష్గ్రపతి భవన్.. దేశంలోని ప్రముఖ స్మారక నిర్మాణాలలో ఒకటైన ఈ భవన్‌లో తొలిసారిగా ఈరోజు(బుధవారం) ఒక వివాహ వేడుక జరగనుంది. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనం నాలుగు అంతస్తులతో 340 గదులను కలిగి ఉంది. ఢిల్లీలో ఉన్న ఈ చారిత్రాత్మక భవనం కొన్నేళ్లుగా ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్టప్రతి భవన్ ఒక వివాహానిక వేదికగా నిలవనుంది.
ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఒక జంట వివాహం చేసుకోబోతోంది. వధూవరులిద్దరూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(
సీఆర్‌పీఎఫ్)లో పనిచేస్తున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలవారు మాత్రమే హాజరుకానున్నారు. వధువు పేరు పూనమ్ గుప్తా. ఈమె సీఆర్‌పీఎఫ్‌లో వ్యక్తిగత భద్రతా అధికారిణి. వరుని పేరు అవనీష్ కుమార్. ఈయన సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్.
74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పూనమ్ గుప్తా విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో వారి వివాహానికి అనుమతినిచ్చారు.
సీఆర్‌పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్ నివాసి. గణితంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. 2018లో ఆమె యూపీఎస్‌సీ సీఆర్‌పీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పూనమ్ గుప్తా ప్రశంసనీయమైన సేవలు అందించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు
Comments
Please login to add a commentAdd a comment