న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడా కంటికి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు మానవతావాదులు కరోనా బాధితులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పీఎం కేర్స్ ఫండ్ కింద అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న వెంటిలేటర్ల గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ మధ్య పోలికలు ఉన్నాయన్నారు. ఆ వెంటిలేటర్లు, మోదీ బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment