సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ సహాయ నిధి ‘పీఎం కేర్స్’కు కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, మధ్య తరగతి ప్రజలు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేయడం విశేషం. కార్మికులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన కంపెనీలు కూడా ‘పీఎం కేర్స్’కు ఆర్థిక సహాయం అందజేయడం అంతుచిక్కని ఆశ్చర్యం. (ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి)
ఫిట్‌నెస్ స్టార్టప్ కంపెనీ ‘క్యూర్ ఫిట్’ మే 4వ తేదీన జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ 800 మంది ఉద్యోగులను తీసివేసింది. పలు చోట్ల తన ఫిట్‌నెస్ సెంటర్లను మూసివేసింది. తీసివేసిన ఉద్యోగుల సహాయార్థం కేవలం రెండు కోట్ల రూపాయలను కేటాయించింది. అదే ‘పీఏం కేర్స్’కు ఐదు కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది. ప్రధాని మోదీకి సన్నిహితులు, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ కంపెనీ భారీ ఎత్తున ముకేశ్ జియో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఉత్సాహంతో ఆయన అతిగా స్పందించారనుకుందాం. ఆయన తన కంపెనీల్లో ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధించారు. తన హైడ్రోకార్బన్ వ్యాపారంలో ఉద్యోగులకు పనితీరు ఆధారంగా జరిపే చెల్లింపులను ఈసారి వాయిదా వేశారు. (కార్చిచ్చులా కరోనా)
కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకారం ‘పీఎం కేర్స్’కు వచ్చే నిధులన్నీ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కిందకు వస్తాయట. పార్లమెంట్ చట్టం ప్రకారంగానీ, మరే ఇతర చట్టం కిందగానీ ‘పీఏం కేర్స్’ ఏర్పడలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణలు చెబుతున్నారు. కార్మికుల కడుపుకొట్టి సహాయ నిధికి సహాయం చేయడంలో అర్థమేముందీ!? (వైట్హౌస్కి కరోనా దడ)
Comments
Please login to add a commentAdd a comment