సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకుగానూ పీఎం కేర్స్‌కు రూ.100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. తమ సంస్థలు ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, హెచ్ఎంఈఎల్ తరపున ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కరోనాను ఎదుర్కోవడంలో భారతీయులు ఎంతో తెగువ చూపుతున్నారని కొనియాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం అత్యంత అవసరమన్నారు. అందులో భాగంగా కరోనా ప్రభావితులను రక్షించేందుకు, వైరస్‌తో పోరాడుతున్న దేశానికి మద్దతు తెలిపేందుకు ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. అంతేకాక తమ కంపెనీలు ప్రతిరోజూ 35 వేలమందికి ఆహారం అందజేస్తున్నాయని తెలిపారు. కాగా టాటా గ్రూప్స్ రూ.1500 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను, సినిమా ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారు. (కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment