laxmi mittal
-
అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
అది చరిత్రలో అత్యంత వైభవంగా, లెక్కకు అందనంత ఖర్చుతో జరిగిన వివాహం. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ తన కుమార్తె వినిషా మిట్టల్ పెళ్లికి డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టారు.ఈ ఘనమైన వివాహానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ మిట్టల్ కుమార్తె వినిషా మిట్టల్ వివాహం 2004లో అత్యంత వైభవంగా జరిగింది. ప్యారిస్‌లో జరిగిన ఈ వివాహం కోసం లక్ష్మీ మిట్టల్ ఏకంగా రూ. 240 కోట్లు ఖర్చుచేశారు. ఇది దేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన వివాహంగా గుర్తింపు పొందింది. వినిషాకు ప్యారిస్‌లోని వాక్స్ లె వియోకొమ్టె మహల్లో వివాహం జరిగింది.6 రోజుల పాటు జరిగిన ఈ ఇండియన్ వెడ్డింగ్‌కు ప్యారిస్ ప్రభుత్వం కూడా సహకారం అందించడం విశేషం.వినిషాకు అమిత్ భాటియాతో వివాహం జరిగింది. వినిషా పెళ్లిలో ఫేమస్ డిజైనర్లు, మెహందీ ఆర్టిస్టులు, ప్రముఖ కుక్‌లు భాగస్వాములయ్యారు. ఇంతేకాదు ఈ వివాహాన్ని మరింత వినోదమయం చేసేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ వివాహానికి 10 వేలమంది అతిథులు హాజరయ్యారు. వినిషా మిట్టల్ వివాహానికి కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ టీమ్‌ను డాన్స్ నేర్పేందుకు పిలిపించారు. ఇంతేకాదు రైటర్, సింగర్ జావేద్ అక్తర్ ఖాన్.. మిట్టల్ ఫ్యామిలీ కోసం ఒక డ్రామా రూపొందించారు. దీనిలో మిట్టల్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అమెరికన్ సింగర్ కైలీ మినాగ్ ఈ వేడుకలో ఒక గంటపాటు ప్రదర్శన ఇచ్చారు. ఇందుకోసం ఆమె కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. లక్ష్మీ మిట్టల్ కుమార్తె పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు జుహీచావ్లా, రాణీ ముఖర్జీ,ఐశ్వర్యరాయ్, సైఫ్ అలీ ఖాన్, షారూఖ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. వీరంతా స్టేజీపై నృత్యాలు చేశారు.ఈ పెళ్లికి హాజరైన అతిథులకు రాయల్ వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేశారు. ఇందుకోసం కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఇండియన్ షెఫ్ మున్నా మహరాజ్‌ను ప్యారిస్ రప్పించారు. ఇంతఘనంగా జరిగిన ఈ వివాహాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే లక్ష్మీ మిట్టల్ కుమార్తె వినిషా వివాహం కేవలం 10 ఏళ్లపాటు మాత్రమే కొనసాగింది. 2014లో విషిషా, అమిత్ భాటియా విడాకులు తీసుకున్నారు. లక్ష్మీ మిట్టల్ ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మ్యాన్లలో ఒకరిగా నిలిచారు.2005లో ఫోర్బ్స్ లిస్టులో మిట్టల్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనికునిగా చోటు దక్కించుకున్నారు. -
బడా పారిశ్రామికవేత్త వంద కోట్ల విరాళం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకుగానూ పీఎం కేర్స్‌కు రూ.100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. తమ సంస్థలు ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, హెచ్ఎంఈఎల్ తరపున ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కరోనాను ఎదుర్కోవడంలో భారతీయులు ఎంతో తెగువ చూపుతున్నారని కొనియాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం అత్యంత అవసరమన్నారు. అందులో భాగంగా కరోనా ప్రభావితులను రక్షించేందుకు, వైరస్‌తో పోరాడుతున్న దేశానికి మద్దతు తెలిపేందుకు ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. అంతేకాక తమ కంపెనీలు ప్రతిరోజూ 35 వేలమందికి ఆహారం అందజేస్తున్నాయని తెలిపారు. కాగా టాటా గ్రూప్స్ రూ.1500 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను, సినిమా ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారు. (కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు) -
విష జ్వరాలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న విష జ్వరాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్న లక్ష్మీ మిట్టల్ గ్రూపు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు విష జ్వరాలపై అధ్యయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు హామీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన హార్వర్డ్ వర్సిటీలోని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ బీ4 ప్రోగ్రాం మేనేజర్ సవితా జి అనంత్‌కు గిరిజనులకు ప్రబలే విషజ్వరాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదికను అందజేసింది. వాటిపై పరిశోధన చేసేందుకు సహకారం అందించాలని కోరగా, దానికి ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో పరిశోధనలను పెంచేందుకు చర్యలు చేపడుతున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు విదేశీ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ లక్ష్మీ మిట్టల్ గ్రూపు నిర్వíßస్తున్న సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలాగే తలసేమియా వ్యాధికి సంబంధించిన పరిశోధనలకు కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డిసెంబర్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
గ్లోబల్ టాప్ సీఈఓల్లో అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్‌కు సంబంధించి ర్యాంకింగ్ విషయానికి వస్తే, ఆర్సిలార్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 3వ ర్యాంక్‌తో ముందు నిలిచారు. అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్‌తో ముకేశ్ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది. టాప్ 3గా లక్ష్మీ మిట్టల్: గ్లోబల్ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్ డచ్ షెల్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెన్ వాన్ బెవుర్డెన్ నిలిచారు. మూడవ స్థానంలో ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ అండ్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. నాల్గవ ర్యాంక్‌ను సౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ హెచ్ నాసర్ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్ బాబ్ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్‌మొబిల్ సీఈఓ డారిన్ ఉడ్స్ ఆరవస్థానాన్ని, ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ హెర్బర్ట్ డియాస్ ఏడవ స్థానాన్ని, టయాటా సీఈఓ అరియో టయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, బెర్క్‌షైర్ హాత్వే సీఓఈ వారెన్ బఫెట్ పొందారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 11వ స్థానాన్ని, యునైటెడ్హెల్త్గ్రూప్ సీఈఓ డేవిడ్ విచ్మన్ 12వ స్థానాన్ని, శాంసంగ్ సీఈఓ కిమ్ కి–నామ్ 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. గర్వకారణం: ఓఎన్జీసీ, ఐఓసీ తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ప్రాతిపదిక ఇది...: సీఈఓలకు సంబంధించి సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ గ్లోబల్ ర్యాకింగ్స్ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాంకింగ్స్‌కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్ రిటర్న్స్ తుది ర్యాంకింగ్‌లో 60 శాతం వెయిటేజ్‌ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ షేర్లు, మార్కెట్ క్యాపిటలైజేషన్లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. -
అంబానీతో పాటు మరో నలుగురు..
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 100 ఇండెక్స్‌లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. అంతేకాక ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా పేరొందారు. 38.3 బిలియన్ డాలర్లు(రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులు కూడా బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆర్సెలర్‌మిట్టల్ సీఈవో లక్ష్మి మిట్టల్, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ చైర్మన్ పల్లోంజి మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్లు ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 500 ఇండెక్స్‌లో మొత్తంగా 24 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగ, ఈ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉన్నట్టు తెలిసింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరు జరా వ్యవస్థాపకుడు అమెంషియో ఓర్టెగా, రెండో వ్యక్తి లగ్జరీ బ్రాండు ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆసియా నుంచి అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ కో-ఫౌండర్, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
ఉత్తమ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
హిందూపురం టౌన్ : విద్యార్థుల్లో ఉన్న ప్రేరణను ఉపాధ్యాయులు వెలికితీసి ఉత్తమ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని ౖఎస్‌సీఈఆర్‌టీ (హైదరాబాద్) అధికారి లక్ష్మిమిఠల్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని చిన్మయా పాఠశాలలో ప్రేరణ అవార్డులపై ఎంఈఓ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ఒకరు లేదా ఇద్దరికి ప్రేరణ అవార్డులు వచ్చిన వారికి రూ.5 వేల చొప్పున నగదు అందించామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారి నాగభూషణం, జిల్లా సైన్స్ సెంటర్ అధికారి ఆనంద్‌భాస్కర్, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్లు సలీమ్, ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
31న అఖీల్ ధూం.. ధాం..
2015కు స్వాగతం చెప్పేందుకు నగరంలో హడావుడి మొదలైంది. భారీ ఈవెంట్లు నగరవాసులను అలరించనున్నాయి. న్యూఇయర్‌కి వెల్కం చెప్పేందుకు అనేక ఈవెంట్ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలను, డీజేలను నగరానికి రప్పిస్తున్నాయి. ఈసారి తన మ్యూజిక్‌తో హోరెత్తించడానికి డీజే అఖీల్ నగరానికి వస్తున్నారు. షేక్ ఇట్ డ్యాడీ మిక్స్‌తో బాగా పాపులర్ అయిన అఖీల్ బాలీవుడ్లో అనేక హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేశారు. అలాగే అతని ఫరెవర్ 1, 2, 3, సిరీస్ కూడా ఎంతో పాపులర్. హోలా పేరుతో హైటెక్స్‌లో 31 నైట్ జరుగుతున్న ఈవెంట్‌కి అఖీల్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. దశాబ్ద కాలానికి పైగా తన మ్యూజిక్‌తో అలరిస్తున్న అఖీల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బిల్ క్లింటన్, కోఫీ అన్నన్ లాంటి ప్రపంచ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. లక్ష్మీ మిట్టల్ లాంటి బిజినెస్ ప్రముఖులు, అమితాబ్, ఐశ్వర్య, కరీనా, సైఫ్ లాంటి బాలీవుడ్ నటులు అఖీల్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసినవారే. లేడీ గగా సాంగ్ ఎడ్జ్ ఆఫ్ గ్లోరీ నుంచి కజ్ రారే (బంటీ అవుర్ బబ్లీ), దర్ద్ ఏ డిస్కో (ఓం శాంతి ఓం) సాంగ్స్ వరకూ అఖిల్ రీమిక్స్ రికార్డ్స్‌లో ఉన్నాయి. -
ఈ పర్వతమిక మిట్టల్ సొంతం!!
-
ఆటగాళ్లకు ఇక 'లక్ష్మీ' కటాక్షం లేదు
లక్ష్మి ఇక ఆటగాళ్లను కరుణించదు. వాళ్ల బాధలేవో వాళ్లే పడాలి ఇక. అవును. ఉక్కు పరిశ్రమతో ప్రపంచమంతటా పేరుపొందిన లక్ష్మీ మిత్తల్ ఇక క్రీడాకారులను స్పాన్సర్ చేయడం లేదు. ఇప్పటి వరకూ వివిధ ఆటల్లో ఆటగాళ్లను స్పాన్సర్ చేయడానికి దాదాపు ఎనభై కోట్లు ఖర్చుపెట్టిన లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఇక తెరమరుగు కానుంది. దీంతో ఇప్పటి వరకూ ట్రెయినింగ్ నుంచి, ఎక్విప్ మెంట్ దాకా, కోచ్ నుంచి ఫిజియో దాకా అయ్యే ఖర్చును ఆటగాళ్లో లేక కల్మాడీలకు కేరాఫ్ అయిన క్రీడా సంఘాలో భరించాలి. దీంతో రాబోయే ఒలింపిక్స్ తయారీల్లో ఆటగాళ్లకు చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది. లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ 2005 నుంచి ఇప్పటి దాకా దాదాపు 40 మంది ఆటగాళ్లను స్పాన్సర్ చేసింది. అందులో 16 గురు కంచు నుంచి కనకం దాకా వివిధ మెడల్స్ గెలుచుకున్నారు. అందులో షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్త, బాక్సర్ విజేందర్ సింగ్, బాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ లు ఉన్నారు. ఈ విజయగాధ బీజింగ్ నుంచి లండన్ దాకా కొనసాగింది. కానీ రాబోయే ఒలింపిక్స్ సంగతేమిటన్నది మాత్రం ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. సరైన క్రీడా వ్యవస్థలు, ప్రణాళికలు, వ్యూహాలు లేని మన దేశంలో స్టార్ ప్లేయర్లున్నా వనరులు, వసతులు లేక, భుజం తట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్నాం. లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఈ లోటును పూరించింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల లక్ష్మీ మిత్తల్ డబ్బు సంచీలను ముడి బిగించేయడంతో క్రికెట్టేతర ఆటలు, ఆటగాళ్లు ఇబ్బందుల్లో పడటం ఖాయం. -
ఐపీఎల్ వైపు లక్ష్మీ మిట్టల్ చూపు!
ముంబై: అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ లీగ్‌లో ముకేశ్ అంబానీతో పాటు విజయ్ మాల్యా లాంటి వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. అయితే ఐపీఎల్లో ఆట పరంగా, ఆర్థికంగానూ అంత లాభసాటిగా లేని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో వాటా తీసుకునేందుకు మిట్టల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన అల్లుడు అమిత్ శర్మ జీఎంఆర్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టులోనూ మిట్టల్‌కు వాటాలున్నాయి. అయితే ఆ జట్టు ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. మరోవైపు ఆర్పీజీ గ్రూపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ ఆర్థిక భారాన్ని పంచుకునేందుకు వాటాదార్ల కోసం చూస్తున్నట్టు సమాచారం.