31న అఖీల్ ధూం.. ధాం.. | Akhil pasricha releases his next single 'Supne' | Sakshi
Sakshi News home page

31న అఖీల్ ధూం.. ధాం..

Published Tue, Dec 30 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

31న అఖీల్ ధూం.. ధాం..

31న అఖీల్ ధూం.. ధాం..

2015కు స్వాగతం చెప్పేందుకు నగరంలో హడావుడి మొదలైంది. భారీ ఈవెంట్లు నగరవాసులను అలరించనున్నాయి. న్యూఇయర్‌కి వెల్‌కం చెప్పేందుకు అనేక ఈవెంట్ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలను, డీజేలను నగరానికి రప్పిస్తున్నాయి. ఈసారి తన మ్యూజిక్‌తో హోరెత్తించడానికి డీజే అఖీల్ నగరానికి వస్తున్నారు. షేక్ ఇట్ డ్యాడీ మిక్స్‌తో బాగా పాపులర్ అయిన అఖీల్ బాలీవుడ్‌లో అనేక హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేశారు. అలాగే అతని ఫరెవర్ 1, 2, 3, సిరీస్ కూడా ఎంతో పాపులర్. హోలా పేరుతో హైటెక్స్‌లో 31 నైట్ జరుగుతున్న ఈవెంట్‌కి అఖీల్ ప్రధాన ఆకర్షణ కానున్నారు.
 
 దశాబ్ద కాలానికి పైగా తన మ్యూజిక్‌తో అలరిస్తున్న అఖీల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బిల్ క్లింటన్, కోఫీ అన్నన్ లాంటి ప్రపంచ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. లక్ష్మీ మిట్టల్ లాంటి బిజినెస్ ప్రముఖులు, అమితాబ్, ఐశ్వర్య, కరీనా, సైఫ్ లాంటి బాలీవుడ్ నటులు అఖీల్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసినవారే. లేడీ గగా సాంగ్ ఎడ్జ్ ఆఫ్ గ్లోరీ నుంచి కజ్ రారే (బంటీ అవుర్ బబ్లీ), దర్ద్ ఏ డిస్కో (ఓం శాంతి ఓం) సాంగ్స్ వరకూ అఖిల్ రీమిక్స్ రికార్డ్స్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement