హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా.. డీజే అఖిల్‌ అరెస్ట్‌ | Drug Peddler Dj Akhil Arrested In Banjara Hills | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా.. డీజే అఖిల్‌ అరెస్ట్‌

Jun 28 2024 9:28 PM | Updated on Jun 28 2024 9:36 PM

Drug Peddler Dj Akhil Arrested In Banjara Hills

సాక్షి,హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ కేంద్రంగా పలు పబ్బుల్లో డీజేగా పనిచేస్తున్న అఖిల్ డ్రగ్స్‌ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. 

అయితే ఓ ప్రాంతంలో డ్రగ్స్‌ అమ్ముతుండగా అఖిల్‌ను హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు నిందితుడు వద్ద గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తెచ్చి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపాడు. 

ఇక డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ అఖిల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌ ఎవరికి అమ్మాడు, వారిలో సెలబ్రిటీలు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement