![Supreme Court Dismissed The Plea On PM Cares Fund - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/14/supreme-court.jpg.webp?itok=mcB27gh_)
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయవాది ఎంఎల్.శర్మ దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దురుద్దేశంతో కూడుకున్నదని, అందుకే దీన్ని తిరస్కరిస్తున్నట్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment