కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సోమవారం నుంచి నిత్యావసర వస్తువులే కాకుండా అన్ని వస్తు సేవల డోర్ డెలివరీని అనుమతిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. దశల వారీగా నియంత్రణలను సడలించి, మే 21 వరకూ జోన్ల వారీగా సడలింపులు ఇచ్చేందుకు కసరత్తు సాగుతోందని ఆమె తెలిపారు. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నామని.. లాక్‌డౌన్ సడలింపులు సహా వస్తుసేవల హోం డెలివరీపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్-19 వ్యాప్తని అడ్డుకునేందుకు క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పీఎం సలీమ్ లేజాన్ అధికారిగా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో పార్థ ఛటర్జీ, చంద్రిమ భట్టాచార్య, ఫిర్హాద్ హకీం సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. షాపులు తిరిగి తెరుచుకునేందుకు అనుమతించాలని ఉత్తర్వులు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోందని మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర నిర్ణయం కోసం బుధవారం వరకూ తాము వేచిచూస్తామని చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉండే ప్రజలు బయటకు రావద్దని మే 21 వరకూ మనం జాగ్రత్తగా ఉండాలని దీదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment