కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద, రైల్వే మంత్రి అశ్విని వైశ్ణవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బెంగాల్‌లోని హౌరా నుంచి న్యూజల్‌పాయ్ గుడి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 564కిలోమీటర్ల దూరాన్ని ఇకపై 7 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. వందేభారత్ రైలు రాకతో ప్రయాణికులకు మూడు గంటల సమయం ఆదా కానుంది. ఈ మార్గంలో బర్సోయ్, మాల్దా, బోల్పూర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వీటిలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో పాటు పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, ఉత్తర బెంగాల్, సిక్కింలోని హిమాలయాలకు చేరుకునే పర్యాటకులు వందేభారత్ రైలులో ప్రయాణించనున్నారు. ఇందులో మొత్తం 16 బోగీలుంటాయి. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. బెంగాల్‌లో రెండు ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తున్నఈ రైలుతో ప్రజల జీవన విధానం మరింత సులభతరం అవుతుందని మోదీ పేర్కొన్నారు.
చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment