సీఎం గొంతు అనుకరించి మోసానికి యత్నించిన మహిళ | FAKE Woman held for faking Mamata's voice to demand money | Sakshi
Sakshi News home page

సీఎం గొంతు అనుకరించి మోసానికి యత్నించిన మహిళ

Published Sat, Sep 6 2014 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

FAKE Woman held for faking Mamata's voice to demand money

బరాసత్: ఫోన్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొంతును అనుకరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ 24-పర్గనాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా..

ఖర్దాకు చెందిన అనన్య బిశ్వా అనే మహిళ ఇద్దరు తృణమాల్ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి తనను మమత బెనర్జీగా చెప్పి, ఆమెలా గొంతు అనుకరించి డబ్బులు అడిగారు. టిటాగఢ్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత చౌదరికి తొలుత ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఖర్దాకు చెందిన మరో సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు దర్యాప్తు చేయగా ఆ ఫోన్ నెంబర్ అనన్యా బిశ్వాస్గా గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement