demand money
-
‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’
సాక్షి, యశవంతపుర (కర్ణాటక): విరాజ్‌పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్యను బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తుమకూరు జిల్లా కొరటగెరెకి చెందిన ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆనంద్ బోపయ్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని, లేదంటే ఏసీబీతో దాడి చేయిస్తానని బెదిరించాడు. దీంతో ఎమ్మెల్యే సీఎం, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. మడికెరి పోలీసులు దర్యాప్తు చేసి ఆనంద్‌ను బెంగళూరు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఏసీబీకి చిక్కిన పీడీఓ, కార్యదర్శి గంగావతి: పట్టాదారు పుస్తకంలో పేర్ల మార్పు కోసం బండిబసప్ప క్యాంప్‌నకు చెందిన విజయ్‌కుమార్ నుంచి రూ.6వేలు లంచం స్వీకరిస్తూ పీడీఓ షేర్‌సాబ్, కార్యదర్శి నూరుల్లాఖాన్‌లు గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ శివకుమార్ పాల్గొన్నారు. చదవండి: రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం -
నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసింది.. డిలీట్ చేయాలంటే!
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసిందంటూ బోగస్ వ్యక్తిగత చాటింగ్‌ను చూపించి వైద్యుడిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... శ్రీనగర్‌కాలనీలో నివసించే వైద్యుడు బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం నిర్మాణం జరుగుతున్న ప్లాట్‌లోకి ఓ వ్యక్తి వచ్చి తన పేరు అయ్యప్పగా పరిచయం చేసుకొని తాను ట్రావెల్ వెహికిల్స్ డ్రైవర్‌నని ఈ ప్లాట్‌ను ఓఎన్జీసీకి అద్దెకు ఇస్తారా అని అడిగాడు. కొద్దిసేపట్లోనే ఓఎన్జీసీ ఆఫీసర్‌నంటూ మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. సాయంత్రం మరోసారి అయ్యప్ప ఆ ప్రాంతానికి వచ్చి వైద్యుడిని కలిసి ఈ చాటింగ్‌ను చూపిస్తూ నీ కూతురు మరో వ్యక్తితో చాటింగ్ చేసిందంటూ డిలీట్ చేయాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. లేకపోతే అంతం చూస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరించాడు. దీంతో వైద్యుడు ఈ నెల 7న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు అయ్యప్పపై పోలీసులు ఐసీసీ సెక్షన్ 448, 385, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళ ఫోన్ కాల్.. దండిగా లాభాలు వస్తాయని చెప్పి -
నీ కూతురు దొరకాలంటే 40 వేలు ఇవ్వు!
ముంబై: తప్పిపోయిన తన కూతురుని వెతికి అప్పగించాలని బాధతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఒక తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు, బీడ్ జిల్లా లోని బేలురా గ్రామానికి చెందిన సదరు తండ్రి తన 17 ఏళ్ల కూతురు తప్పిపోయిందని స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు స్టేషన్ చుట్టు తిరిగేవాడు. ఈ క్రమంలో, ఒక రోజు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అనిల్ గవాంకర్ అనే అధికారి ఒక మధ్య వర్తి ద్వారా 40,000 రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే నీ కూతురు దొరుకుతుందని మధ్యవర్తి ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ బాలిక తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను, పేదవాడినని అంత డబ్బుఇవ్వలేనని వేడుకున్నాడు. మధ్య ర్తి మాత్రం డబ్బులిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పాడు. దీంతో, బాలిక తండ్రి అప్పుచేసి మొదటగా, 15,000 వేలను చెల్లించాడు. ఎలాగైనా తన కూతురుని వెతికివ్వాలని ప్రాధేయపడ్డాడు. ఎనిమిది రోజులు గడుస్తున్న ఎలాంటి పురోగతి లేదు. మధ్యవర్తి మరో 10,000 ఇవ్వాలని కోరాడు. పాపం, ఆ తండ్రి అదికూడా ఇచ్చాడు. అయినా తన బాలిక ఆచూకి మాత్రం లభించలేదు. ఇక లాభం లేదని విసిగెత్తి పోయిన ఆ తండ్రి బీడ్ జిల్లా ఎస్పీని సంప్రదించాడు. తన కూతురు తప్పిపోయిన విషయాన్ని, పోలీస్ అధికారి డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఎస్పీకి వివరించాడు. తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ రికార్డులను ఎస్పీకి చూపించాడు. ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకొని ఎలాగైనా తన కూతురుని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.దీనిపై స్పందించిన ఎస్పీ, బేలూరా ఇన్స్పెక్టర్ పై విచారణ జరపటానికి గవ్ హంకర్ అనే మరో పోలీస్ అధికారిని నియమించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని గవ్హంకర్ను ఆదేశించారు. చదవండి: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ -
రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తా
సాక్షి, శ్రీకాళహస్తి : అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 1వ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌కు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరి గ్రామానికి చెందిన దుర్గ (18)తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. నాలుగు నెలలుగా దుర్గ అమ్మగారింట్లోనే కాపురం ఉంటున్నారు. రెండు నెలల క్రితం శ్రీకాళహస్తి వచ్చారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు రాజీ చేయడానికి ప్రయత్నించగా రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తానని వెంకటేష్ చెప్పినట్టు అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం కూడా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర ఆగ్రహం చెందిన వెంకటేష్ కత్తితో దుర్గపై దాడి చేశాడు. చెయ్యి, కాలుకు తీవ్రం గాయాలయ్యాయి. బంధువులు ఆమెను వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకటేష్ పోలీసులకు లొంగిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై హత్యాయత్నం, వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. -
డబ్బులు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా..
హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నాది బాధ్యత అన్నారు
తమిళసినిమా: ఏదైనా నేనే బాధ్యత వహిస్తానని నటు డు శింబు అన్నారని ఇప్పుడు నష్టాన్ని ఆయనే భరించాలని నిర్మాత మైఖెల్‌రాయప్పన్ డిమాండ్ చేస్తున్నారు. ఈయన శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. శ్రియ, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. గత జూన్‌లో విడుదలైన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాల్ని కలిగించింది. ఈ నష్టానికి కారణం నటుడు శింబునేనని, నిర్మాత మైఖెల్‌రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. నటుడు శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర పూర్తి స్క్రిప్ట్ చదివిన తరువాత చిత్రంలో నటించడానికి అంగీకరించారని తెలిపారు. చిత్ర షూటింగ్ సగం పూర్తయిన తరువాత చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించండి ఏం జరిగినా తాను బాధ్యత వహిస్తానని, రెండ వ భాగానికి పారితోషికం కూడా తీసుకోనని శింబు చెప్పారన్నారు. అంతకు ముందే దర్శకుడు చెప్పినట్లు ఆయన కథలో నటించలేదని ఆరోపించారు. తాను శిం బు అడిగిన పారితోషికం చెల్లించానని చెప్పారు. అయి తే చిత్రం విడుదలై తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిం దన్నారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వారి నష్టానికి శింబు బాధ్యత వహించాలని తాను నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశానన్నారు. మండలి నిర్వాహకులు విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని చెప్పి నెల రోజులు అయ్యిందని ఇప్పటి వరకూ పరిష్కారం జరగలేదని, శింబునే నష్టాన్ని భరించాలని నిర్మాత మైఖెల్ రాయప్పన్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నటుడు శింబుకు రెడ్‌కార్డ్ విధించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
మీడియాకు చిక్కిన నయీం బెదిరింపు కాల్
-
డబ్బు ఇస్తావా? చస్తావా?
హుక్కా సెంటర్ల నిర్వాహకులకు పాతనేరస్తుడి బెదిరింపులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు బంజారాహిల్స్: హుక్కాసెంటర్లు, కాఫీ షాపుల యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఓ పాతనేరస్తుడిని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొఘల్‌పురాకు చెందిన సొహైల్ ముబారక్ అల్ ఖసేరి (25) జిమ్ ట్రైనర్. పాతనేరస్తుడైన ఇతడిపై ఫలక్‌నుమా, భవానీనగర్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో క్రిమినల్ కేసులున్నాయి. తరచూ నేరాలు చేస్తుండటంతో మీర్‌చౌక్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఆరు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ‘ఖిల్లా’ హుక్కా సెంటర్ యజమానిని సొహైల్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. ఇదే విధంగా ఇతను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు హుక్కాసెంటర్లు, కాఫీషాపుల యజమానులను హెచ్చరించాడు. కాగా, ఖిల్లా హుక్కాసెంటర్ యజమాని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సొహైల్‌పై ఐపీసీ సెక్షన్ 385,511, 507 కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని రెండు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. -
సీఎం గొంతు అనుకరించి మోసానికి యత్నించిన మహిళ
బరాసత్: ఫోన్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొంతును అనుకరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ 24-పర్గనాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా.. ఖర్దాకు చెందిన అనన్య బిశ్వా అనే మహిళ ఇద్దరు తృణమాల్ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి తనను మమత బెనర్జీగా చెప్పి, ఆమెలా గొంతు అనుకరించి డబ్బులు అడిగారు. టిటాగఢ్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత చౌదరికి తొలుత ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఖర్దాకు చెందిన మరో సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆ ఫోన్ నెంబర్ అనన్యా బిశ్వాస్‌గా గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.