Hyderabad Crime News Today Telugu: Man Blackmailing To Doctor For Money With Fake Chatting - Sakshi
Sakshi News home page

Hyderabad Crime News: నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్‌ చేసింది.. డిలీట్‌ చేయాలంటే!

Published Sun, Jan 9 2022 8:26 AM | Last Updated on Sun, Jan 9 2022 10:28 AM

Fake Chatting: Man Blackmailing To Doctor For Money In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్‌ చేసిందంటూ బోగస్‌ వ్యక్తిగత చాటింగ్‌ను చూపించి వైద్యుడిని బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... శ్రీనగర్‌కాలనీలో నివసించే వైద్యుడు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–3లో ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం నిర్మాణం జరుగుతున్న ప్లాట్‌లోకి ఓ వ్యక్తి వచ్చి తన పేరు అయ్యప్పగా పరిచయం చేసుకొని తాను ట్రావెల్‌ వెహికిల్స్‌ డ్రైవర్‌నని ఈ ప్లాట్‌ను ఓఎన్‌జీసీకి అద్దెకు ఇస్తారా అని అడిగాడు.

కొద్దిసేపట్లోనే ఓఎన్‌జీసీ ఆఫీసర్‌నంటూ మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. సాయంత్రం మరోసారి అయ్యప్ప ఆ ప్రాంతానికి వచ్చి వైద్యుడిని కలిసి ఈ చాటింగ్‌ను చూపిస్తూ నీ కూతురు మరో వ్యక్తితో చాటింగ్‌ చేసిందంటూ డిలీట్‌ చేయాలంటే డబ్బులు డిమాండ్‌ చేశాడు. లేకపోతే అంతం చూస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరించాడు. దీంతో వైద్యుడు ఈ నెల 7న బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు అయ్యప్పపై పోలీసులు ఐసీసీ సెక్షన్‌ 448, 385, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: మహిళ ఫోన్‌ కాల్‌.. దండిగా లాభాలు వస్తాయని చెప్పి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement