35 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు?
స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదు
సామాజిక బాధ్యత మరిచారు
ఓఎన్జీసీపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం
ఆలమూరు (కొత్తపేట) :
మండపేట కేజీ బేసి¯ŒS పరిధిలో ఓఎ¯ŒSజీసీ తవ్వకాలు చేపట్టిన 35 యేళ్ల నుంచి ఆలమూరు పరిసర ప్రాంతాల్ని ఎందుకు అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను నిలదీసారు. ఆలమూరు మండలంలోని కలవచర్లలో కొత్తగా చేపట్టబోయే షేల్ గ్యాస్ తవ్వకాలపై శనివారం స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ జే రాధాకృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ప్రధాన అధికారి డి.రవీంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి ఎమ్మె ల్యే హాజరై ఓఎ¯ŒSజీసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిం చారు. మండలం చుట్టూ ఏడు బావుల్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల నుంచి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఓఎన్జీసీ స్థానిక ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. స్థానికుడొక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తవ్వకాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్థానికుల భద్రతపైనా భరో సా ఇవ్వడం లేదన్నారు. ఒక్క గ్రామాన్ని కూడా మోడల్ విలేజీగా నిర్మించక పోవడంపై సంస్థ పక్షపాత వైఖరి స్పష్టమవుతోం దన్నారు. సామాజిక బాధ్యత కింద గ్రామాల అభివృద్ధి చేయకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కలవచర్ల చమురు బావిలో పనులు ప్రారంభించేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఎంతవరకూ సమంజమన్నారు.
చమురు బావిలో ఎగసిన మంటలు
ఆలమూరు : ఆలమూరు–మండపేట రోడ్డులోని కొత్తూరు సెంటర్లో ఓఎ¯ŒSజీసీ వెలికి తీస్తున్న చమురు, సహజ వాయు బావిలో శనివారం మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించగలిగారు. ఓఎ¯ŒSజీసీ రిగ్ పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన రోజునే హఠాత్తుగా మంటలు వెలువడటంపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. పక్కనే ఉన్న కొత్తూరు సెంటర్ వాసులు మూకుమ్మడిగా వెళ్లి ఓఎ¯ŒSజీసీ అధికారులను నిలదీశారు. పరిశీలనలో భాగంగానే సహజవాయువును ఒక్కసారిగా వదిలివేయడం వల్ల మంటలు అధికంగా వ్యాపించినట్లు ఓఎ¯ŒSజీసీ అధికారులు తెలిపారు.
కార్యకలాపాలను అడ్డుకోవడం తమ అభిమతం కాదు
దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం తమ అభిమతం కాదని, సంస్థ తన బాధ్యత మరువకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి గ్రామాలను ఆదుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణపై సర్పం చ్కు కూడా సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా డీఎస్పీ ఎ¯ŒSబీఎం మురళీకృష్ణ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
రూ.44 కోట్ల వ్యయంతో గ్యాస్ వెలికితీత
మండలంలోని కలవచర్లలో రూ.44 కోట్ల వ్యయంతో ఓఎ¯ŒSజీసీ షేల్ గ్యాస్ ను వెలికి తీస్తుందని ఆసంస్థ ప్రతినిధులు పి.చంద్రశేఖర్, బి.ప్రసాదరావు, ఎ.కామరాజు తెలిపారు. పర్యావరణానికి ఏవిధమైన హాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నిదానంగా తవ్వకాలు చేపట్టి దాదాపు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఓఎ¯ŒSజీసీ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఆలమూరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. జాతీయ ఓఎ¯ŒSజీసీ శాఖ నిబంధనల మేరకు కలవచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటూ గత ఏడాది డిసెంబర్ మూడున ఆదేశించిందని, అందులో భాగంగానే ఈఏడాది జనవరి మూడున పత్రిక ప్రకటన జారీ చేయడంతో పాటు పరిసర పంచాయతీలకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశీయ ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలకు మద్దతును ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక చమురు బావిలో త్రవ్వకాలు చేపట్టే విధానం, ఓఎ¯ŒSజీసీ కార్యకలపాలను అధికారులు దృశ్య రూపంలో వివరించారు.
సమాచారం లేదు
ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిం చిన ప్రజాభిప్రాయ సేకరణపై రైతులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని ప్రజా సంఘాల నాయకు లు, స్థానికులు ఆరోపించారు. చమురు తవ్వకాల వల్ల కలిగే అనర్థాలను సభికులకు వివరించారు. ఓఎ¯ŒSజీసీ నిర్లక్ష్య పోకడల వల్ల జిల్లా వాసులు ఏవిధంగా నష్టపోతున్నదీ జన విజ్ఞాన వేదిక, మానవ హక్కుల వేదిక, ఎంఆర్పీఎస్, జాగృతి సేవాసంస్థ, రైతుకూలీ సంఘం ప్రతినిధులు చేపట్టిన ప్రసంగం స్థానికులను ఆలోచింపజేసింది.