తమిళసినిమా: ఏదైనా నేనే బాధ్యత వహిస్తానని నటు డు శింబు అన్నారని ఇప్పుడు నష్టాన్ని ఆయనే భరించాలని నిర్మాత మైఖెల్‌రాయప్పన్ డిమాండ్ చేస్తున్నారు. ఈయన శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. శ్రియ, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. గత జూన్‌లో విడుదలైన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాల్ని కలిగించింది. ఈ నష్టానికి కారణం నటుడు శింబునేనని, నిర్మాత మైఖెల్‌రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. నటుడు శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర పూర్తి స్క్రిప్ట్ చదివిన తరువాత చిత్రంలో నటించడానికి అంగీకరించారని తెలిపారు. చిత్ర షూటింగ్ సగం పూర్తయిన తరువాత చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించండి ఏం జరిగినా తాను బాధ్యత వహిస్తానని, రెండ వ భాగానికి పారితోషికం కూడా తీసుకోనని శింబు చెప్పారన్నారు. అంతకు ముందే దర్శకుడు చెప్పినట్లు ఆయన కథలో నటించలేదని ఆరోపించారు.
తాను శిం బు అడిగిన పారితోషికం చెల్లించానని చెప్పారు. అయి తే చిత్రం విడుదలై తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిం దన్నారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వారి నష్టానికి శింబు బాధ్యత వహించాలని తాను నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశానన్నారు. మండలి నిర్వాహకులు విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని చెప్పి నెల రోజులు అయ్యిందని ఇప్పటి వరకూ పరిష్కారం జరగలేదని, శింబునే నష్టాన్ని భరించాలని నిర్మాత మైఖెల్ రాయప్పన్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నటుడు శింబుకు రెడ్‌కార్డ్ విధించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment