ముంబై: తప్పిపోయిన తన కూతురుని వెతికి అప్పగించాలని బాధతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఒక తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు, బీడ్ జిల్లా లోని బేలురా గ్రామానికి చెందిన సదరు తండ్రి తన 17 ఏళ్ల కూతురు తప్పిపోయిందని స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు స్టేషన్ చుట్టు తిరిగేవాడు.
ఈ క్రమంలో, ఒక రోజు స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అనిల్ గవాంకర్ అనే అధికారి ఒక మధ్య వర్తి ద్వారా 40,000 రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే నీ కూతురు దొరుకుతుందని మధ్యవర్తి ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ బాలిక తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను, పేదవాడినని అంత డబ్బుఇవ్వలేనని వేడుకున్నాడు. మధ్య ర్తి మాత్రం డబ్బులిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పాడు. దీంతో, బాలిక తండ్రి అప్పుచేసి మొదటగా, 15,000 వేలను చెల్లించాడు. ఎలాగైనా తన కూతురుని వెతికివ్వాలని ప్రాధేయపడ్డాడు. ఎనిమిది రోజులు గడుస్తున్న ఎలాంటి పురోగతి లేదు. మధ్యవర్తి మరో 10,000 ఇవ్వాలని కోరాడు. పాపం, ఆ తండ్రి అదికూడా ఇచ్చాడు. అయినా తన బాలిక ఆచూకి మాత్రం లభించలేదు.
ఇక లాభం లేదని విసిగెత్తి పోయిన ఆ తండ్రి బీడ్ జిల్లా ఎస్పీని సంప్రదించాడు. తన కూతురు తప్పిపోయిన విషయాన్ని, పోలీస్ అధికారి డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఎస్పీకి వివరించాడు. తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ రికార్డులను ఎస్పీకి చూపించాడు. ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకొని ఎలాగైనా తన కూతురుని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.దీనిపై స్పందించిన ఎస్పీ, బేలూరా ఇన్‌స్పెక్టర్ పై విచారణ జరపటానికి గవ్ హంకర్ అనే మరో పోలీస్ అధికారిని నియమించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని గవ్హంకర్ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment