missing girl
-
కరీంనగర్లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌లోని విద్యారణ్యపురి కాలనీకి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కనుకుంట్ల స్వప్న–నరసింహ దంపతుల కూతురు వశిష్టకృష్ణ(12) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. తిరిగి కరీంనగర్‌కు వచ్చేందుకు వశిష్టకృష్ణను ఆమె తాతయ్య బుధవారం ఉదయం పెద్దపల్లిలో బస్సు ఎక్కించాడు. ఆ బస్సును ఫొటో తీసి, నరసింహకు ఫోన్లో పంపించాడు. దీంతో ఆయన కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో ఎదురుచూశా డు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన బస్సులో నుంచి వశిష్టకృష్ణ దిగలేదు. కండక్టర్‌ను అడిగితే బొమ్మకల్ బ్రిడ్జి వద్ద దిగినట్లు చెప్పా డు. వెంటనే అక్కడికి వెళ్లి వెతికినా కనిపించకపోవడంతో నరసింహ కరీంనగర్‌రూరల్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు అదృశ్యం కేసు నమోదు చేసుకొని, బాలిక ఆచూకీ వెతుకుతున్నారు. -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ.. తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం -
ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక
వెంగళరావునగర్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్ కమలానగర్‌కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది. దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్పూర్లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి) -
తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..
తిరుపతి అర్బన్: తల్లి మందలించడంతో అలిగి వచ్చిన యువతిని తిరుపతి బస్టాండ్ భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలంకు చెందిన సుందర పాండ్యన్ కుమార్తె హాసిని(20) బెంగళూరులో చదువుకుంటోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద చిన్నపాటి పనులు కూడా చేయకుండా సోమరిగా ఉండడంతో, ఆదివారం ఉదయం ఆమె తల్లి కల్యార్సీ మందలించింది. దీంతో అలిగిన హాసిని ఇంటి నుంచి బయల్దేరి వచ్చేసింది. హాసిని తల్లిదండ్రులు సేలం పోలీస్‌స్టేషన్‌లో కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు హాసిని తిరుపతికి చేరుకుంది. తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువతిని భద్రతా సిబ్బంది షేకా ఖాజా రహంతుల్లా గుర్తించారు. వెంటనే దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఆ యువతి వివరాలను తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకుని వారి కుమార్తెను కలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బందికి, దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
Nizamabad: కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్లో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలోని నర్సిలో పాపను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లగా.. బంధువులు, పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పాప ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. పాపను తీసుకుని పోలీసులు నిజామాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజులకు పాప ఆచూకీ లభ్యమైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించి విచారణ చేయడంతో ఆచూకీ తెలుసుకోగలిగారు. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో... -
నీ కూతురు దొరకాలంటే 40 వేలు ఇవ్వు!
ముంబై: తప్పిపోయిన తన కూతురుని వెతికి అప్పగించాలని బాధతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఒక తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు, బీడ్ జిల్లా లోని బేలురా గ్రామానికి చెందిన సదరు తండ్రి తన 17 ఏళ్ల కూతురు తప్పిపోయిందని స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు స్టేషన్ చుట్టు తిరిగేవాడు. ఈ క్రమంలో, ఒక రోజు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అనిల్ గవాంకర్ అనే అధికారి ఒక మధ్య వర్తి ద్వారా 40,000 రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే నీ కూతురు దొరుకుతుందని మధ్యవర్తి ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ బాలిక తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను, పేదవాడినని అంత డబ్బుఇవ్వలేనని వేడుకున్నాడు. మధ్య ర్తి మాత్రం డబ్బులిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పాడు. దీంతో, బాలిక తండ్రి అప్పుచేసి మొదటగా, 15,000 వేలను చెల్లించాడు. ఎలాగైనా తన కూతురుని వెతికివ్వాలని ప్రాధేయపడ్డాడు. ఎనిమిది రోజులు గడుస్తున్న ఎలాంటి పురోగతి లేదు. మధ్యవర్తి మరో 10,000 ఇవ్వాలని కోరాడు. పాపం, ఆ తండ్రి అదికూడా ఇచ్చాడు. అయినా తన బాలిక ఆచూకి మాత్రం లభించలేదు. ఇక లాభం లేదని విసిగెత్తి పోయిన ఆ తండ్రి బీడ్ జిల్లా ఎస్పీని సంప్రదించాడు. తన కూతురు తప్పిపోయిన విషయాన్ని, పోలీస్ అధికారి డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఎస్పీకి వివరించాడు. తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ రికార్డులను ఎస్పీకి చూపించాడు. ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకొని ఎలాగైనా తన కూతురుని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.దీనిపై స్పందించిన ఎస్పీ, బేలూరా ఇన్స్పెక్టర్ పై విచారణ జరపటానికి గవ్ హంకర్ అనే మరో పోలీస్ అధికారిని నియమించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని గవ్హంకర్ను ఆదేశించారు. చదవండి: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ -
ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది
సాక్షి, హైదరాబాద్: గత పదిహేనేళ్లుగా సాకినా తప్పిపోయిన తన బిడ్డ ఫాతిమాను తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. రెండున్నరేళ్ల వయసులో తప్పిపోయిన తన కుమార్తె.. ప్రస్తుతం ఎక్కడుందో.. ఎలా ఉందో.. అసలు బతికి ఉందో లేదో అనే ఆలోచన ఆ తల్లి గుండెని పిండేసేది. ఎక్కడో ఒక చోట తన బిడ్డ క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థించేది. ఆమె మొర ఆలకించిన దేవుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత వారి గుండెకోతను దూరం చేశాడు. చివరకు కుమార్తెని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. దాదాపు 16 ఏళ్ల క్రితం కర్నూలుకు చెందిన ఫాతిమా తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. మక్కా మసీదు సందర్శనలో ఉండగా.. తప్పిపోయింది. అప్పటి నుంచి వెతుకుతుండగా..16 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఓ చిల్డ్రన్ హోంలో తనను గుర్తించారు. ప్రస్తుతం ఆమెని కుటుంబం వద్దకు చేర్చారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఫాతిమా.. ఆ తర్వాత 15 ఏళ్లు హోంలో స్వప్న పేరుతో హిందువుగా పెరిగింది. ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతుంది. ఈ సందర్భంగా ఫాతిమా అలియాస్ స్వప్న సోదరుడు అబిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ ఉద్వేగభరిత సన్నివేశం. మేం ఫాతిమాను మా ఇంటికి తీసుకెళ్లి.. బంధువులు, స్నేహితులకు పరిచయం చేస్తాం. ఆ తర్వాత ఆమెను తిరిగి హోంకు పంపిస్తాం. తన చదువును కొనసాగిస్తుంది’ అని తెలిపాడు. (చదవండి: 16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!) -
16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల కింద తప్పిపోయిన ఓ బాలిక రాష్ట్ర పోలీసుల సాయంతో తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో 16 ఏళ్ల కింద ఓ బాలిక తప్పిపోయింది. అప్పట్లో ఆ బాలికను కొందరు చేరదీసి మియాపూర్ అనాథాశ్రమానికి పంపారు. ఆపరేషన్ స్మైల్–7లో భాగంగా అనాథాశ్రమంలోని చిన్నారుల వివరాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం పోలీసులు ఆరా తీశారు. హుస్సేనీ ఆలంలో మిస్సైన బాలికను గుర్తించారు. గతంలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారు ప్రస్తుతం ఎక్కడున్నారో గాలించారు. కర్నూలులో ఉన్న బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గురువారం అనాథాశ్రమానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలిక వారి కూతురేనని నిర్ధారించారు. 16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
డేంజర్ బెల్స్; రోజుకు నలుగురు మిస్సింగ్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి మహానగరంలో బాలికల అదృశ్య సంఘటనలు పెరిగిపోయాయి. ప్రతీరోజు సగటున నలుగురు బాలికలు అపహరణకు గురవుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అపహరణకు గురైన వారిలో 15–17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే అధికంగా ఉన్నారు. అంతేగాకుండా ఇలా అపహరణకు గురైన వారిలో పెళ్లి పేరుతో నమ్మించి మోసపోయిన బాలికలే అధికంగా ఉన్నారు. భయంతోనే.. మైనర్ బాలికలు అపహరణకు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు అంటే గడిచిన 10 నెలల్లో ఏకంగా 1,141 మైనర్ బాలికలు అపహరణకు గురైనట్లు వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అందులో 912 కేసులు పరిష్కరించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. అపహరణకు గురైన బాలికల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కేసులే అధికంగా ఉన్నాయని దర్యాప్తులో పోలీసులు తేల్చారు. మైనర్ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అపహరణ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నారు. కాని పట్టుబడిన తరువాత చేపట్టిన విచారణలో పెళ్లి పేరట మోసపోయిన కేసులే అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బాలికల తల్లిదండ్రులు పరువు పోతుందని, అలాగే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదులు చేయడానికి వెనకడగు వేస్తున్నారు. కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ తరువాత ఉప సంహరించుకుంటున్నారు. మైనర్ బాలికలు సులభంగా మోసపోవడానికి కొన్ని ప్రధాన కారణాలను పోలీసులు వెల్లడించారు. మోసపోయిన వారిలో అధికంగా కాలేజీలకు వెళ్లే బాలికలే ఉన్నారు. నేటి సినిమాల ప్రభావం కూడా మోసపోవడానికి తోడవుతున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, అత్యాచారం చేసి ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేయడం, సోషల్ మీడియాను అతిగా వాడడం ఇలా కొన్ని ప్రధాన కారణాలున్నాయి. -
తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్
గూగుల్ మ్యాప్స్ మతిస్థిమితం లేని బాలికను తండ్రి చెంతకు చేర్చింది. ఈ యాప్ సహాయంతో పోలీసులు బాలిక తల్లిదండ్రుల జాడను కనుక్కోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కృతినగర్‌లో మార్చి 31న ఓ బాలిక రిక్షా ఎక్కింది. ఎక్కడకు వెళ్లాలని అడిగిన రిక్షా డ్రైవర్ ప్రశ్నకు ఏమీ బదులివ్వకుండా బిత్తర చూపులు చూడసాగింది. దీంతో అనుమానం వచ్చిన రిక్షావాలా ఆ బాలికను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి వారికి అప్పగించాడు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా తనది కుర్జా గ్రామమని సమాధానమిచ్చింది. దీంతో కుర్జా పదానికి దగ్గరగా అనిపించే పలు ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అలాగే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆ బాలిక ఓ విస్తుపోయే విషయాన్ని తెలిపింది. తన అంకుల్ పింటుతో కలిసి కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి ట్రైన్లో వచ్చానని చెప్పింది. తనను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పేస్తుంటే ఏడవడంతో పింటు తనను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు తనని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి వేధింపులు జరగలేదని నిర్ధారణ అయింది. రోజులు గడుస్తున్నా బాలికకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకకపోవటంతో పోలీసులకు దర్యాప్తు కష్టతరమైంది. బులంద్‌షహర్ జిల్లాలో కుర్జా గ్రామం ఉందని తెలుసుకున్న పోలీసులు జూలై 31న బాలికను వెంటపెట్టుకుని ఆ ఊరికి వెళ్లారు. బాలికను ఆ గ్రామ పరిసర ప్రాంతాల పేర్లు చెప్పమని అడగ్గా ఆమె తల్లి నివసించే సోన్బార్సా గ్రామం పేరు చెప్పింది. గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకున్న పోలీసులకు సోన్బార్సా గ్రామం నిజంగానే ఉన్నట్టు గుర్తించారు. దీంతో సులువుగా వారి కుటుంబ సభ్యులను కనిపెట్టారు. అక్కడ బాలికను తన తండ్రి చేతికి అప్పగించారు. బాలిక తండ్రి జీతన్ మాట్లాడుతూ.. ‘నా కూతురికి చికిత్స చేయడానికి ఆగస్టు 1న కుర్జా గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చాం. ఇందుకోసం కీర్తినగర్‌లోని జేజే కాలనీలో సోదరి ఇంటి వద్ద ఉన్నాం. అక్కడ నా కూతురు తప్పిపోయింది’ అని పేర్కొన్నారు. సంవత్సరం క్రితం కూడా తను ఇలాగే తప్పిపోయినా పంజాబ్‌లోని లుథియానాలో మళ్లీ దొరికిందని తెలిపారు. అందుకే తమ కూతరు కనిపించకపోతే పోలీసులు తనను ఎలాగైనా తీసుకువస్తారనే ధీమాతో ఉన్నానన్నారు. అయితే బాలిక చెప్పినట్టుగా పింటు అనే పేరుతో ఎవరూ లేరని జీతన్ స్పష్టం చేయడంతో పోలీసులు లైంగిక వేధింపుల కేసును కొట్టివేశారు. -
పాపం.. ఆ అమ్మాయి చనిపోయింది
కౌలాలంపూర్: మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్ బాలిక నోరా కొయిరిన్(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్ మజ్లాన్ మన్సూర్ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. నోరా కొయిరిన్ మృతదేహాన్ని హెలికాప్టర్లో తరలిస్తున్న సహాయక సిబ్బంది(రాయిటర్స్ ఫొటో) నోరా కొయిరిన్ కిడ్నాప్ అయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, నోరా కొయిరిన్ ఆచూకీ కోసం పోలీసులతో పాటు చాలా మంది వలంటీర్లు గాలించారు. తమ కుమార్తె ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రింగిట్స్(సుమారు 8.5 లక్షలు) నజరానా ఇస్తామని నోరా కొయిరిన్ తల్లిదండ్రులు ప్రకటించారు. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది. (చదవండి: ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు) -
ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు
న్యూఢిల్లీ : ఆ అమ్మాయి కోసం అడవంతా అణువణువు గాలిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది సాయుధలు. పోలీసు జాగిలాలతో పరుగులుతీస్తూ హెలికాప్టర్లతో చక్కెర్లు కొడుతున్నారు. మైకుల ద్వారా రారమ్మని పిలుస్తున్నారు. ఘాట్ రోడ్డులో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి ఫొటో చూపించి ఆమె గురించి వాకబు చేస్తున్నారు. తారస పడుతున్నా తండాల ప్రజల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఆమె జాడ కోసం మలేసియా ‘స్టేట్ ఫైర్ అండ్ రిస్క్యూ డిపార్ట్మెంట్’కు చెందిన 80 మంది సిబ్బంది, 200 మంది ఎలైట్ కమాండోలు, ‘వ్యాట్ 69 కమాండో’ యూనిట్‌కు చెందిన 30 మంది గాలిస్తుండగా, పోలీసులు వారి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ జాడ దొరక్కపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆమె క్షేమాన్ని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇంత మంది ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నారంటే ఆ అమ్మాయి దేశ ప్రధానియో, ప్రధాని కూతురో కాదు. అసలు దేశానికి చెందిన అమ్మాయే కాదు. లండన్ పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. ఆమె పేరు నోరా కొయిరిన్. ఆమె స్కూల్ విద్యార్థులతో పాటు ఇటీవల మలేసియా వచ్చారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’లో బస చేశారు. అటవిలో సంచరించి ఆదివారం రాత్రి తన గదికి వచ్చిన ఆ అమ్మాయి మరుసటి రోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. రూము కిటికీ తలుపులు తెరచి ఉండడంతో ఎవరైనా ఆమెను ఎత్తుకపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ముందుగా రిసార్ట్ ఏరియాలో వెతికిన సాయుధ సిబ్బంది, ఓ చోట ఫెన్షింగ్ దెబ్బతిని ఉండడంతో ఆవలనున్న దట్టమైన అటవి ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. ఆ అమ్మాయి ‘హోలోప్రొసెన్సెఫలి’ అనే మెదడు జబ్బుతో బాధ పడుతోందని, సొంతంగా మొబైల్ ఫోన్‌కు కూడా సమాధానం ఇవ్వలేదని ఆమె తల్లి మెబ్ కొయిరిన్ తెలిపారు. ఎక్కడున్న రావాల్సిందిగా ఆమె చేత కూతురిని పిలిపించి, ఆ వాయిస్‌ను రికార్డు చేసి మరి అడవంతా వినిపిస్తున్నా నేటికి ఆమె జాడ దొరకలేదు. ఈ గాలింపు చర్యల్లో భద్రతాపరమైన కారణాల వల్ల అమ్మాయి తల్లిదండ్రులనుగానీ, తోటి విద్యార్థులనుగానీ అనుమతించడం లేదని పోలీసు చీఫ్ దాటక్ మొహమ్మద్ మట్ యూసుఫ్ తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు...తప్పిపోయిన బాలిక
విజయనగరం టౌన్: తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ చదువుకోవాలన్నా ఆ చిన్నారిని, బంధువుల ఇంట్లో పెట్టి చదివించడం వల్ల తల్లిదండ్రుల ప్రేమ కరువైంది. విషయాన్ని ఆ చిన్నారి సూటిగా చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టడంతో చేసేది లేక, ఏం చేయాలో తెలియక రైలెక్కేసింది. మూడురోజులైనా కుమార్తె కనబడకపోయే సరికి ఆ తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ పాలరాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ ప్రత్యేక బృందం ఒక్కరోజు వ్యవధిలోనే ఆ చిన్నారిని కనుగొని, అందరి మన్ననలు అందుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ సీఐ వి.చంద్రశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం టి.కొత్తూరు గ్రామానికి చెందిన జెట్టి కృష్ణారావు తన కుమార్తె రోషిణీ మహికి మంచి చదువును అందించాలనే సంకల్పంతో పట్టణంలోని ఎయిమ్ కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేసి, తన బంధువుల ఇంటివద్ద అమ్మాయిని ఉంచాడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పదే పదే ఆ అమ్మాయి తెలిపేది. కానీ, తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో ఇటీవలి కాలంలో ఆమెకు చదువుపై ఆసక్తి తగ్గింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వారు తమ కుమార్తెను ఇష్టానికి వ్యతిరేకంగానే చదివించేందుకు ప్రయత్నించడంతో, విసుగు చెందిన ఆ చిన్నారి జనవరి 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కూలీలు కడుపున పెట్టి చూసుకున్నారు.. విజయనగరం రైల్వేస్టేషన్లో రైలెక్కిన రోషిణీకి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి శంబర పండగకు వచ్చి, పనుల కోసం వలస కూలీలుగా తిరిగి వెళ్తున్న బృందం కలిసింది. వారితో మాట్లాడే క్రమంలో తనకెవ్వరూ లేరని తెలపడంతో వారు తమ వెంట రోషిణీని కంకిపాడు గ్రామానికి తీసుకువెళ్లిపోయారు. రోషిణికి ఎటువంటి లోటు లేకుండా చూశారు. దర్యాప్తు ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా రోషిణీ విజయవాడ వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అక్కడకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో శ్రమించిన ఆ బృందం ఎట్టకేలకు రోషిణీని కనుగొని పట్టణానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అమ్మాయిని వెదికి పట్టుకోవడంలో వన్‌టౌన్ కానిస్టేబుల్ రామకృష్ణ, శ్రీనివాసరావు, కాల్‌డేటా కానిస్టేబుల్ రవి ఎంతగానో కృషి చేయడంతో వారిని వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. -
కాలేజీ నుంచి తిరిగి రాని యువతి
శంషాబాద్ (రాజేంద్రనగర్) : కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హమీదుల్లానగర్ గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవళిక (19) ఈ నెల 21 శంషాబాద్‌లో తాను చదువుతున్న డిగ్రీ కళాశాలకు వెళుతున్నట్టు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ రోజు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. ఆచూకి లభించకపోవడంతో శనివారం ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పి పోయిన బాలిక తల్లి దండ్రులకు అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం: తప్పి పోయిన బాలికను టూ టౌన్ పోలీసులు తల్లి దండ్రుల చెంతకు చేర్చారు. మైదుకూరు రోడ్డులోని చాపల వీధికి చెందిన మహేష్ రోడ్డు సైడ్ వ్యాపారం చేస్తుంటాడు. అతని రెండేళ్ల కుమార్తె పరి మంగళవారం సాయంత్రం మైదుకూరు రోడ్డులోని ఆరవేటి ధియేటర్ సమీపంలో ఏడుస్తూ ఉండగా స్థానికులు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఏడుస్తున్న చిన్నారి తన పేరు తప్ప తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. దీంతో ఎస్ఐ మంజునాథరెడ్డి తన సిబ్బందిని వీధుల్లో విచారించేందుకు పంపించారు. రెండు గంటల తర్వాత చాపలవీధిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు గుర్తించారు. వారిని స్టేషన్‌కు పిలిపించి కుమార్తె పరిని అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు రాధా, మహేష్‌లు టూ టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్‌లో అదృశ్యం.. గోవాలో ప్రత్యక్షం
శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లభ్యమైంది. విశాఖపట్నం నుంచి పుణె బయల్దేరి, మధ్యలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించకుండా పోయిన కైరవి (17) గోవాలో ప్రత్యక్షమైంది. కైరవి అదృశ్యం అయినట్లు తెలియగానే ముందుగా విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజిని గమనించారు. అక్కడ ఆమె గోవాకు వెళ్లినట్లు తెలియడంతో ముందుగా గోవా ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. తర్వాత ఆమె ఫోన్ సిగ్నల్‌ను పరిశీలించి.. గోవా బీచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమె తండ్రి అరవింద్ శర్మకు ఆ విషయం చెప్పారు. ఆయన బయల్దేరి గోవా వెళ్లగా అక్కడ ఆయనకు అప్పగించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత గానీ ఆమె ఎందుకు గోవా వెళ్లిందో తెలియదు. కొంతమంది స్నేహితులతో వెళ్లినట్లు అనధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. విశాఖలో నేవీ ఆఫీసర్‌గా పనిచేసే అరవింద్ శర్మ కుమార్తె కైరవి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది. ఆమె గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి విమానంలో శంషాబాద్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి పుణేకు వెళ్లాల్సి ఉంది. అయితే పుణె వెళ్లలేదని తెలిసిన ఆమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు యువతి ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
హైదరాబాద్ అమ్మాయి, ప్రియుడు యూపీలో..
డియోరియా: హైదరాబాద్‌లో తప్పిపోయిన ఓ బాలిక, ఆమె ప్రియుడిని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతం నివాసి, ఇంటర్ కాలేజీ విద్యార్థిని గత నెల 21న తప్పిపోయింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. బాలిక తన ప్రియుడితో కలసి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. డియోరియాలో ఓ యువకుడు ఈ యువజంటకు ఆశ్రయం ఇచ్చాడు. గురువారం పోలీసులు ఈ యువజంటను అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయమిచ్చిన యువకుడిని అరెస్ట్ చేశారు. -
హూద్దాబేగాన్ని ఎందుకు చంపినట్లు?
-
హుద్దాబేగం హత్యలో వీడుతున్న చిక్కుముళ్లు
-
కాలువలో శవమై తేలిన విద్యార్థిని
ప.గో: గత కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన ప్రియాంక అనే విద్యార్థిని కాలువలో శవమై తేలింది. జిల్లాలోని పాలకొల్లు పట్టణంలోని ఇబ్రహిల్ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రియాంక ఈనెల 19వ తేదీన అదృశ్యమైంది. ఈ మేరకు ఆ బాలిక తల్లి దండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం విద్యార్థిని మృతదేహాన్నినరసాపురం కాలువలో కనుగొన్నారు. విద్యార్థిని చదువుతున్నపాఠశాల హస్టల్ వార్డేన్తో పాటు మరొకర్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘీక సంక్షేమశాఖ జేడీ, ఐసీడీఎస్ పీడీలను విచారణకు ఆదేశించారు. -
అదృశ్యమైన శివ నాగనందిని ఆచూకీ లభ్యం
విజయవాడ : విజయవాడలో కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అదృశ్యమైనట్లుగా భావిస్తున్న పాప ఆచూకీ దొరికింది. అయోధ్య నగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి దుర్గా నరేష్ కూతురు శివనాగ నందిని నిన్న అదృశ్యం అయ్యిందంటూ పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం స్కూలుకు వెళ్లిన తమ కూతురు స్కూలు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కనిపించకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శివనాగ నందిని ఆచూకీ కనిపెట్టారు. పోలీసుల సంరక్షణలో ఆమె క్షేమంగా ఉంది. పాప క్షేమంగా ఉందనే సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.