
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలోని నర్సిలో పాపను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లగా.. బంధువులు, పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పాప ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. పాపను తీసుకుని పోలీసులు నిజామాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజులకు పాప ఆచూకీ లభ్యమైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించి విచారణ చేయడంతో ఆచూకీ తెలుసుకోగలిగారు.
చదవండి:
టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో...
Comments
Please login to add a commentAdd a comment