
తప్పి పోయిన బాలిక తల్లి దండ్రులకు అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం: తప్పి పోయిన బాలికను టూ టౌన్ పోలీసులు తల్లి దండ్రుల చెంతకు చేర్చారు. మైదుకూరు రోడ్డులోని చాపల వీధికి చెందిన మహేష్ రోడ్డు సైడ్ వ్యాపారం చేస్తుంటాడు. అతని రెండేళ్ల కుమార్తె పరి మంగళవారం సాయంత్రం మైదుకూరు రోడ్డులోని ఆరవేటి ధియేటర్ సమీపంలో ఏడుస్తూ ఉండగా స్థానికులు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఏడుస్తున్న చిన్నారి తన పేరు తప్ప తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. దీంతో ఎస్‌ఐ మంజునాథరెడ్డి తన సిబ్బందిని వీధుల్లో విచారించేందుకు పంపించారు. రెండు గంటల తర్వాత చాపలవీధిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు గుర్తించారు. వారిని స్టేషన్‌కు పిలిపించి కుమార్తె పరిని అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు రాధా, మహేష్‌లు టూ టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.