శంషాబాద్ (రాజేంద్రనగర్) : కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని హమీదుల్లానగర్ గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవళిక (19) ఈ నెల 21 శంషాబాద్‌లో తాను చదువుతున్న డిగ్రీ కళాశాలకు వెళుతున్నట్టు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ రోజు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. ఆచూకి లభించకపోవడంతో శనివారం ఆర్‌జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.