ప.గో: గత కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన ప్రియాంక అనే విద్యార్థిని కాలువలో శవమై తేలింది. జిల్లాలోని పాలకొల్లు పట్టణంలోని ఇబ్రహిల్ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రియాంక ఈనెల 19వ తేదీన అదృశ్యమైంది. ఈ మేరకు ఆ బాలిక తల్లి దండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం విద్యార్థిని మృతదేహాన్నినరసాపురం కాలువలో కనుగొన్నారు. విద్యార్థిని చదువుతున్నపాఠశాల హస్టల్ వార్డేన్‌తో పాటు మరొకర్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘీక సంక్షేమశాఖ జేడీ, ఐసీడీఎస్ పీడీలను విచారణకు ఆదేశించారు.