'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు' | Zakir Naik didn’t force people to convert to Islam: Brother to ED | Sakshi
Sakshi News home page

'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు'

Published Tue, Mar 21 2017 3:55 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు' - Sakshi

'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు'

న్యూఢిల్లీ: ఇస్లాం మతంలోకి మారాలని తన సోదరుడు ఎవరినీ బలవంతపెట్టలేదని ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్‌నాయక్‌ సోదరుడు మహ్మద్‌ అబ్దుల్‌ కరీమ్‌ నాయక్‌ చెప్పారు. తన సోదరుడికి భిన్న మతాలపై అవగాహన ఉందని, చాలా కాలంగా ఆయన మతబోధకుడిగా ఉన్నారని, ఆ క్రమంలో ఆయనకు ఎవరితో బలవంతంగా మతమార్పిడులు చేయించలేదని, స్వచ్ఛందంగానే కొంతమంది మతమార్పిడి చేసుకున్నారని తెలిపారు.

జకీర్‌ నాయక్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జకీర్‌కు సంబంధించిన సంస్థల ప్రతినిధులను కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే జకీర్‌ సోదరుడిని మూడుసార్లు ప్రశ్నించిన ఈడీ ఆ మేరకు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు జకీర్‌ సోదరిని ఈడీ విచారించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement