లాలీపాప్ ఓఎస్‌తో ఇంటెక్స్ ఆక్వా స్టార్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చి కొంతకాలమైనప్పటికీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ తొలిసారి దీంతో పనిచేసే ఓ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆక్వాస్టార్ శ్రేణిలో ‘ఎల్’ బ్రాండ్ నేమ్‌తో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఖరీదు దాదాపు రూ.6999 మాత్రమే. అయిదు అంగుళాల స్క్రీన్‌సైజు, డ్యుయెల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. +
ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది జీబీల ఇన్‌బిల్ట్ స్టోరేజీ దీని సొంతం. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, జీపీఆర్‌ఎస్, ఎడ్జ్, వైఫై, మైక్రో యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. కేవలం 130 గ్రాముల బరువుండే ఆక్వాస్టార్ ఎల్‌లో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు.